రామ్ చరణ్ – ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ లో ఇంత తేడానా …!

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానుల‌ను తమ ఖాతాలో వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మారారు. ఇదంతా కూడా దర్శక దిగ్గజం రాజమౌళి పడిన కష్టానికి ఫలితం అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా గత నెల మార్చి 25న విడుదలై అందరి మన్ననలను అందుకుంటోంది. ఇప్పటికే రు. 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 1200 కోట్ల వరకు తన పరుగు సాగిస్తోంది.

దీంతో ఈ సినిమా గురించి… ఇందులో నటించిన నటీనటుల గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఈ సినిమాలో కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ – అల్లూరి సీతారామరాజుగా చేసిన రామ్ చరణ్ గురించి ఏ న్యూస్ వచ్చినా అభిమానులు వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే ఒక న్యూస్ హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ – రామ్ చరణ్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్టీఆర్ :
ఎన్టీఆర్ చదువు పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీ వడ్లమూడి నుండి ఇంట‌ర్ పూర్తి చేశాడు. రామ్ చరణ్ మాత్రం హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీకామ్ కు జాయిన్ అయ్యాడు. కానీ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యాడు.

ఎన్టీఆర్ కు కార్లు మరియు బైక్ ల మీద ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇతనికి లంభోర్గని యురస్ గ్రాఫైట్ కాప్స్యూల్ అనే మోడల్ కార్ ఉంది. ఎన్టీఆర్ ఇండియాలోనే మొదట సొంతం చేసుకున్న ఓనర్ గా ఘనత అందుకున్నారు. దీని విలువ ఏకంగా రూ.3.16 కోట్లు. అంతే కాకుండా రూ.5 కోట్ల విలువ చేసే ఊరస్ సూపర్ స్పోర్ట్ కారు కూడా ఉంది. అలాగే రేంజ్ రోవర్ వోగ్యు కార్ కూడా ఇతను కొనుగోలు చేశాడు. దీని విలువ అక్షరాలా 1.95 కోట్ల విలువ ఉంది. అదే విధంగా పోర్స్చే 718 కేమెన్ కార్ కూడా 85.95 లక్షల విలువ కలిగి ఉంది. ఇక ఇదే కంపెనీకి చెందిన మరొక కారు విలువ 1.2 కోట్లుగా ఉంది. ఇక బి ఎం డబ్ల్యు కంపెనీ కి చెందిన 730 LD కార్ విలువ 1.32 కోట్లుగా తెలుస్తోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని విలువ 80 కోట్లు. ఈ ప్రైవేట్ జెట్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పార్క్ చేసి ఉంటారు. అవసరం అయినప్పుడు మాత్రమే వాడుతారు. కార్లు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు ఖరీదు అయిన భవనాలు కూడా ఉన్నాయి. అందులో హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఒక బంగ్లా ఉంది. ఇది మాత్రమే కాకుండా బెంగుళూరు, హైదరాబాద్ లలో మరిన్ని విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మొత్తం సంపాదన తెలిసిన సమాచారం ప్రకారం 444 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రామ్ చరణ్ :
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే తనకు ఉన్న ఎక్కువ విలువ కలిగిన కార్ లలో ఆస్టన్ మార్టిన్ మాంటేజ్ ఒకటి. అయితే ఈ కారుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కారును చిరంజీవి రామ్ చరణ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడట మరియు ఇదే రామ్ చరణ్ కు మొదటి కార్ అని తెలుస్తోంది. ఇక రోల్స్ రోయ్స్ ఫాంటమ్ అనే కార్ కూడా ఇతనికి ఉంది. ఈ కారు విలువ 3.34 కోట్లుగా ఉంది. అంతే కాకుండా రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ అనే కారును కలిగి ఉన్నాడు. దీని ధర అక్షరాలా 3.5 కోట్లు అన్ని చెప్పవచ్చు. రామ్ చరణ్ కు ప్రత్యేక జెట్ కూడా ఉంది, మరియు ట్రూ జెట్ అనే ఒక ఎయిర్ లైన్ కంపెనీ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కు రామ్ చరణ్ మరియు చిరంజీవి పక్క పక్కన ఇళ్లలోనే ఉంటారట. రామ్ చరణ్ రీసెంట్ గా జూబిలీ హిల్స్ లో ఒక లక్సరీ బంగ్లాను కొనుగోలు చేశాడట. దీని కోసం అతను 30 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంపాదన మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ౧౩౦౦ కోట్లుగా తెలుస్తోంది.

Share post:

Popular