ఏంటి.. త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ పది సన్నివేశాలు.. వేరే సినిమా నుంచి కాపీ కొట్టినవేనా?

దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు అంతే గ్రాండ్గా వసూళ్లను కూడా సాధిస్తోంది.ఎన్నో రికార్డులను కొల్లగొడుతుంది త్రిబుల్ ఆర్ సినిమా. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకులకు సినిమాల పై అవగాహన పెరిగిపోయిన నేపథ్యంలో సినిమాల్లో ఏదైనా సన్నివేశం ముందు చూసినట్లు అనిపించింది అంతే చాలు దాని కోసం వెతకడం ఈ సన్నివేశం కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అద్భుతమైన కళాఖండం త్రిబుల్ ఆర్ లో కూడా పది సన్నివేశాలు వివిధ సినిమాల నుంచి కాపీ కొట్టినవే అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

1. త్రిబుల్ ఆర్ సినిమా లో మొదట రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తాడు.అయితే ఈ సీన్ ను అవెంజర్స్ సినిమా నుంచి తీసుకున్నారట.

2. ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే ఫైటింగ్ సీన్ లో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ భుజాలమీద ఎక్కి దూకుతాడూ. ఈ సన్నివేశాన్ని కుంఫు పాండా సినిమా లోని ఒక సీన్ కి చాలా దగ్గరగా ఉంటుందట.

3. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సన్నివేశాన్ని 10000 బీసీ సినిమా నుంచి తీసుకున్నారట.

4. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకరి బైక్ పై ఒకరు గుర్రంపై వెళుతూ ఉంటారు. ఇక ఈ సన్నివేశాన్ని ఘోస్ట్ రైడర్ సినిమాలోని ఒక సన్నివేశము ఆధారంగానే జక్కన్న తెరకెక్కించాడట.

5. ఇక అల్లూరి సీతారామరాజు జైలు సీన్ చూస్తే ఇక అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన వేట సినిమా లోని ఒక సన్నివేశం గుర్తొస్తుంది అంటున్నారు ప్రేక్షకులు.

6. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఒక స్టెంట్ చేసి ఆ తర్వాత ఒకరి చేతులు ఒకరు పట్టుకునే సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే స్టార్ వార్స్ ది ఓల్డ్ రిపబ్లిక్ సినిమా నుంచి ఇక ఈ సన్నివేశం తీసుకున్నట్లు తెలుస్తోంది.

7. అలాగే కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ విలన్ల ఇంటి మీదకి అన్ని అడవి జంతువుల తో కలిసి దూకె ఒక సన్నివేశం బాగా హైలెట్ అయింది. అయితే ఈ సీన్ ని టార్జాన్ సినిమా నుంచి తీసుకున్నారట.

8. ఇక ఒక పిల్ల తో బ్రిటిష్ వాళ్ళు పాట పాడించడం తర్వాత పాట నచ్చి తమతోపాటు తీసుకువెళ్లడం తో సినిమా మొదలవుతుంది. అయితే ఈ సన్నివేశాన్ని రాజశేఖర్ హీరోగా నటించిన పాప కోసం సినిమా కాన్సెప్ట్ కు కాస్త దగ్గరగానే ఉంటుందట.

9. లేడీ స్కాట్ కొమరం భీమూడో పాట సమయంలో అనే డైలాగ్స్ కూడా మైకేల్ జాక్సన్ పాట అయినా రిమెంబర్ దట్ టైం పాట గుర్తుకు వస్తుందట.

10. అజయ్ దేవగన్ తన నడుముకు బాంబ్ కట్టుకొని చనిపోయే సీన్ ఎంతో బాగా బాగా పండింది. అయితే ఇక ఈ సన్నివేశం జీరో డార్క్ 30 సినిమా నుంచి తీసుకున్నారట. వీటితోపాటు మన్యంపులి సినిమా లోని కొన్ని రిఫరెన్స్ లు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయని సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు..

Share post:

Latest