పిలిచి అవకాశమిచ్చిన బడా హీరో బంపర్ ఆఫర్.. రాజమౌళి రిజెక్ట్..రీజన్ తెలిస్తే షాకే ..!!

రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మన ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఒక్కే ఒక్క డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. అభిమానులు ముద్దుగా ఈయనను జక్కన్న అని పిలుచుకుంటారు. ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన సినిమాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అంటే దీని బట్టి అర్ధం చేసుకోండి..ఆయన సినిమాలు ఎలా ఉంటాయో.

తీసిన కధ మళ్ళీ తీయ్యకుండా..తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని ఫాలో అవుతూ.. మరే డైరెక్టర్ కూడా అలా చేయకుండా తనకంటూ ఓ మార్క్ సెట్ చేసుకున్నాడు రాజమౌళి. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ఈయన రీసెంట్ గా RRR అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పలు రికార్డులు తిరగరాస్తుంది. అభిమానుల అంచనాలను ఏం మాత్రం తీసిపోకుండా కూసింత ఎక్కువే రీచ్ అయ్యాడు రాజమౌళి.

ఇలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయాలని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కి ఉంటుంది. కానీ ఆ అవకాశం ఆందరికి రాదు. లక్ ఉండాలి. కాగా, బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి అని అనుకున్నాడట. అది కూడా మహాభారతం లాంటి గొప్ప సినిమా లో నటించాలి అనుకున్నాడట. నిజానికి మహాభారతాని తెరకెక్కించాలనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇక అమీర్ ఈ విషయమై జక్కన్న ఫాదర్ తో చర్చించగా .,..పూర్తి స్టోరీ రాయలేను,,స్టోరీ లైన్ రాసి ఇస్తాను అని చెప్పాడట. కానీ, రాజమౌళి మాత్రం అమీర్ తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు అని.. ఎందుకంటే మహాభారతాని తెరకెక్కించాలి టే సుమారు నాలుగు ఐదేళ్లు పడుతుందని..కానీ తను వేరే సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాను అని చెప్పుతూ సున్నితంగా రిజెక్ట్ చేశారట.

Share post:

Popular