ఆ హీరోకి కొరటాల ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్…ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే ?

యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. టాలీవుడ్ లో ని ఓ బడా హీరోకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నాడట. మనకు తెలిసిందే..ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి, చరణ్ ల తో కలిసి..”ఆచార్య” అనే సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా..ఎట్టకేలకు ఫైనల్ గా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల తారక్ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అన్ని బాగుంటే ఈ సినిమా ఈపాటికి పట్టాలెక్కి ఉండాల్సింది. కానీ, అనుకోని కారణాల చేత..ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం..కొరటాల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసేశారట. తారక్ కోసం కోట్లు ఖర్చు చేసి.. ఆయన ఇంటికి దగ్గర్లోనే ఓ అద్భుతమైన సెట్ కూడా వేశారట.

అన్ని బాగుంటే జూన్ రెండో వారం లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే..ఈ సినిమాకి తారక్ తో ముందు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ కంటే కూడా ఇప్పుడు కొరటాల ఎక్కువ ఇస్తున్నారట. దానికి కారణం ..సినిమా కోసం ఆయన తారక్ నుండి ఎక్కువ కాల్ షీట్లు తీసుకోవడమే అంటున్నారు. మొదట 60 కాల్ షీట్లు మాత్రమే బుక్ చేసుకున్న కొరటాల ఇప్పుడు మరో 15 కాల్ షీట్లు ఎక్స్ ట్రా తీసుకున్నారట. అందుకోసమే తారక్ కు ఎక్కువ పారితోషకాని ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి తారక్ కు కొరటాల ఎలాంటి హిట్ అందిస్తాడో..?

Share post:

Popular