అలియా-రణ్‌బీర్‌ పెళ్లి: కండోమ్‌ ప్యాకెట్‌ గిఫ్ట్ గా ఇస్తానన్న దీపికా..ఎందుకంటే..!!

ప్రస్తుతం బాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అదే అలియా-రణ్‌బీర్‌ పెళ్లి గురించే. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట..పెళ్లి కాకుండానే పబ్లిక్ గా చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. పలు ఫంక్షన్లకి..టూర్ లకి జంటగానే వెళ్తూ..భార్యభర్తల లానే బీహేవ్ చేస్తున్నారు. నిజానికి పరిస్ధితులు అనుకూలించి ఉంటే ఈ జంట ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది. కానీ, కరోనా మహమ్మారి అడ్డువచ్చి వీళ్ల పెళ్లిని లేట్ చేసింది. ఇక ఆ తరువాత వరుస సినిమా షూటింగ్స్ లో ఉన్న వీళ్ళు..ఫైనల్ గా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా, మీడియా అంతా అలియా-రణ్‌బీర్‌ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే.. సడెన్ గా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా రణ్‌బీర్‌ పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది. మనకు తెలిసిందే రణ్‌బీర్‌..అలియా కంటే ముందు ఇద్దరు టాప్ హీరోయిన్ల తో డేటింగ్ అంటూ ఓ రేంజ్ లో తిరిగారు. వాళ్లు మరెవరో కాదు..ఒకరు కత్రినా కైఫ్..మరోకరు దీపికా పదుకునే. వీళ్ళు పబ్లిక్ గానే రాసుకుంటూ పూసుకుంటూ తిరిగేశారు. అబ్బో దీపికాతో రణ్‌బీర్‌ అయితే మరీ టూ మచ్..పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉన్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేసాయి. వీళ్ల యవ్వారం చూసి అందరు పెళ్లి చేసుకునేస్తారు అనుకున్నారు.

కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయారు. సరిగ్గా అదే టైంలో కరణ్ జోహర్ నిర్వహిస్తున్న..”కాఫీ విత్ కరణ్” అనే షోకి గెస్ట్ గా వచ్చారు దీపికా. ఆ టైంలో హోస్ట్.. రణ్‌బీర్‌ గురించి తన ఒపినీయన్ అడగ్గా..ఆమె రణ్‌బీర్‌ కి కండోమ్‌ ప్యాకెట్‌ గిఫ్ట్ గా ఇస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో పక్కనే ఉన్న సోనమ్ కపూర్ సైతం షాక్ అయ్యింది. రణ్‌బీర్‌ శృంగారం లో అంత సీన్ లేదని కూడా ఆ షోలో చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయం పై అప్పట్లో పెద్ద దుమారమే నడించింది. అయితే తాజాగా అలియా-రణ్‌బీర్‌ ల పెళ్లి జరుగుతుంది అని తెలిసి కొందరు కావాలనే ఆయనను బ్యాడ్ చేయడానికి ఈ వీడియోను వైరల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.