అదే నిజమైతే ప్రభాస్ సినీ చాప్టర్ క్లోజ్..వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!!

ప్రముఖ సినీ జోతిష్యుడు వేణు స్వామి..గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక్క వార్తతో అటు సినిమా ఇండస్ట్రీలోను..ఇటు రాజకీయ లోను హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఈయన జోతిష్యం చెప్పితే అది 100% జరుగుతుందనేది వాళ్ల నమ్మకం..అలాగే జరిగాయి కూడా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత- అక్కినేని కుర్రాడు నాగచైతన్య విడిపోతారని వాళ్ల లవ్ మ్యాటర్ స్టార్ట్ అయిన్నప్పుడే చెప్పేశాడు . కానీ అప్పట్లో ఆ విషయాని ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు.

అలాగే అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌ పెళ్లి విషయంలోను ఆయన చెప్పిందే జరిగింది. ఆయన చెప్పిన్నట్లే నిశ్చితార్ధం జరిగాక పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికి వీళ్ల పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో రీజన్ మాత్రం బయటకి రాలేదు. సిని సెలబ్రిటీస్ విషయాలే కాదు..పోలిటికల్ లోను చంద్రబాబు ఓడిపోతారని ముందే జోతిష్యం చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి.. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయయోగం లేదని కూడా అప్పట్లో చెప్పి సెన్సేషన్ కి తెర తీసారు.

కాగా, ప్రజెంట్ ఆయన రెబల్ స్టార్ హీరో ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రీసెంట్ ఇంటర్వ్యుల్లో వేణు స్వామి మాట్లాడుతూ..ప్రభాస్ జాతకం ప్రకారం జీవితంలో అది పెద్ద ప్రాబ్లమ్‌స్ ఎదురుకోబోతున్నాడని.. కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలు పడబోతున్నాయని.. దయచేసి ఆయన తో సినిమాలు తెరకెక్కించాలి అనుకునే డైరెక్టర్లు నిర్మాతలు ఓసారి ఆలోచించుకోండి అంటూ మాట్లాడిన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి పై మండిపడుతున్నారు. నువ్వు చెప్పేది అంతా వినడానికి ప్రజలు పిచ్చోళ్ల ..పోవయ్యా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరికొందరు ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ప్లీజ్ ప్రభాస్ కి ఫ్లాప్ సినిమాలు పడకుండా ఏదైన పూజాలు చేయించండి అంటూ..రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ పేరు మరోసారి నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

Share post:

Popular