33 ఏళ్లు దాటాక అలా చేయకూడదా..ఆకట్టుకుంటున్న అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా.. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా కలసి నటించిన చిత్రం “అశోకవనంలో అర్జున కళ్యాణం”. ఇప్పటికే ఈ సినిమా పై జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు మూవీ మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రతి పెళ్లి కానీ అబ్బాయికి కనెక్ట్ అయ్యేలా ఉంటున్నాయనే టాక్ బయటకు వచ్చింది. ఇక అలాంటి డైలాగ్స్ ను యువ నటుడు విశ్వక్‌ సేన్‌ తన స్టైల్ లో చెప్పితే..ధియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే..అలా ఉంటాది రియాక్షన్.

ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా నిజానికి ఏప్రిల్ 22న విడుదల కావాల్సి ఉండి. కానీ మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేశారు దానికి కారణం లేకపోనూలేదు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఖ్ఘ్F 2 విడుదల అవుతున్న సంధర్భంగా..ఈ సినిమా దెబ్బైపోతుందని.. మేకర్స్ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసి..ఫైనల్ గా మే 6న మన ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు.

తాజాగా మూవీ టీం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. అభిమానులు ఊహించిన్నట్లుగానే జనాలు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాల్లో ఉండేట్లు ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ముప్పై ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి కాని కుర్రాడు.. ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్.. వెళ్లిన పెళ్లి చూపుల్లో అడిగే ప్రశ్నలు.. అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది..డైరెక్టర్ క్లీయర్ గా తెరకెక్కించిన్నట్లు తెలుస్తుంది. ఇక విశ్వక్ సేన్ చేప్పే డైలాగ్స్ కుర్రాళ్లను బాగా ఆకట్తుకుంటున్నాయి. ఓవర్ ఆల్ గా విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమాల్లో విశ్వక్ సేన్ కామెడీనే మెయిన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు తెలుస్తుంది. మరి సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి..?

Share post:

Latest