శ్రీదేవి, జయప్రద మధ్య గొడవల‌కు కారణం.. అదేనా..?

అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ల పొజిషన్లో ఉన్న వారే. అయితే కాలం మారుతున్న కొద్దీ వాటితోపాటుగా హీరోయిన్లు కూడా మారడం జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం మర్చిపోలేని వ్యక్తులు మాత్రం కొంత మంది ఉంటారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి,జయప్రద కూడా ఒకరని చెప్పవచ్చు. వీరు తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా తమ సత్తా చాటారు. ఇక ఈ ఇద్దరిలో సీనియర్ ఎవరు జూనియర్ అనే ప్రశ్న వేస్తే శ్రీదేవి అనే చెప్పాలి..

ఎందుచేత అంటే శ్రీదేవి నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా తన కెరీర్ ని ప్రారంభించింది. శ్రీదేవి 1975వ సంవత్సరంలో అనురాగాలు సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె కంటే ఒక సంవత్సరం ముందే భూమి కోసం అనే సినిమా ద్వారా జయప్రద తెరమీదకు కనిపించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన నటించిన అడవి రాముడు చిత్రం తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక శ్రీదేవి కూడా అంతకు ముందే 16 ఏళ్ళ వయసు సినిమాతో మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు పొందింది. కానీ ఎన్టీఆర్ నటించిన వేటగాడు సినిమాతోనే ఆమె కూడా బాగా పాపులర్ అయ్యింది.

ఇక ఆ తర్వాత కృష్ణ తో బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమాలో నటించింది శ్రీదేవి. అయితే మొదట ఈ సినిమాలో జయప్రద ను హీరోయిన్ గా అనుకున్నారట. అందుకోసం కొంత డబ్బును కూడా అడ్వాన్సుగా ఇచ్చినట్లు గా సమాచారం. అయితే చివరి క్షణాల్లో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జయప్రద ను తప్పించడం జరిగింది. ఇక ఆ తర్వాత శ్రీదేవికి ఈ అవకాశం వరించింది. ఇక అప్పట్నుంచి శ్రీదేవి – జయప్రద మధ్య తెలియని పోటీ మొదలైందని చెప్పవచ్చు. అలా వీరిద్దరికి.. ఒకరికొకరు డేట్స్ దొరకకపోతే మరొకరు సినిమాని ఒప్పుకుంటూ ఉండేవారు.

స్టార్ హీరోలతో నటించి రికార్డు క్రియేట్ చేశారు శ్రీదేవి, జయప్రద. అలా వీరిద్దరి మధ్య పోటీ మొదలైనప్పటి నుంచి మాటలు కరువయ్యాయట. అయితే కొన్ని సినిమాల్లో కలిసి నటించినప్పటికీ ఆ సినిమా షూటింగ్ వరకే వీరిద్దరూ క్లోజ్ గా ఉండే వారట. అయితే వీరిద్దరూ కేవలం టాప్ పోజిషన్ కోసమే పోటీ పడినట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే మీడియా ముందు జయప్రద మాట్లాడుతూ నేను మొదటినుంచి అందగత్తెనని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పిన మాటలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచిందట. అలా వీరిద్దరూ 30 సంవత్సరాల పాటు మాట్లాడుకో లేదట.