వావ్: విడాకుల తర్వాత ఫస్ట్ టైం..చైతన్య ఫోటోను షేర్‌ చేసిన సామ్‌..ఎందుకో తెలుసా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత జంట..ఏమాయ చేసావే సినిమా టైంలోనే ఒకరు అంటే ఒకరికి క్రష్ ఏర్పడిందట. కానీ ఆ విషయం బయటకి చెప్పుకోలేదు.. కొంత కాలం అయ్యాక వీళ్లు ఆటో నగర్ సూర్య చేసారు. ఆ టైంలో క్లోజ్ అయ్యారు. ఆ తరువాత మనం సినిమా టైంకి లవ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. షాకింగ్ ఏమిటంటే అప్పటి వరకు కూడా చైతన్య-సమంత లవ్ చేసుకుంటున్నట్లు నాగార్జునకి తెలియదట. ఈ విషయం ఆయనే ఓ ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు.

అయితే, ఫైనల్ గా ఇంట్లో పెద్దలను ఓప్పించి గోవా లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట..ఆ తరువాత పిచ్చ పిచ్చగా పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేశారు. వామ్మో ఆ టైంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలను అందరు సమంత ని చూసి నేర్చుకోండి..భర్త అంటే ఎంత గౌరవం..ఆ మర్యాద, ప్రేమ..కేరింగ్ అంటూ ఓ రేంజ్ లో సమంతని పొగిడేసారు. చాలా మంది ఈ చూడ ముచ్చటైన జంటను చూసి కుళ్ళుకున్నారు కూడా. ఆ దిష్టే తగిల్లిందేమో.. ఏవో మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.

వీళ్లు విడిపోతున్నాం అని చెప్పిన్నప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది అన్నదానికంటే ఎక్కువ బాధపడ్డారు ఫ్యాన్స్, ఇక అక్కినేని అభిమానులు అయితే ప్లీజ్ మీరు విడిపోకండి అంటూ సోషల్ మీడియా వేదికగా..మెసేజ్లు చేసారు. కానీ, నీ దారి నీదే..నా దారి నాదే అన్నట్లు వీళ్లు వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు ప్రకటించిన్నప్పటి నుండి సమంత చైతన్య కి సంబంధించి..ఏం మాట్లాడలేదు..ఒక్క పిక్ కానివ్వండి..పోస్ట్ కానివ్వండి..చివరికి ఆయన పుట్టినరోజు నాడు కూడా విష్ చేయలేదు. కానీ , ఇప్పుడు సమంత చైతన్య ఫోటోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి మజిలీ సినిమా 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆమె 3ఇయర్స్‌ ఆఫ్‌ మజిలీ అంటూ ఓ పోస్టర్‌ని షేర్‌ చేసుకుంది. డివోర్స్‌ తర్వాత తొలిసారి సామ్‌ చై ఉన్న ఫోటో షేర్‌ చేయడంతో ఈ పోస్ట్‌ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో సామ్-చై ఇష్యూ మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular