అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?

పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకు ఎప్పుడు చూడని నిధి మనం ఈ సినిమాలో చూడబోతున్నామట.

ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ..పవన్ లక్కి డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ ని కూడా ఫినిష్ చేయనున్నాడు పవన్. అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో సాయి పల్లవి కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది. గ్లామరస్ పాత్రలు అంటే మండిపడే ఈ మలర్ బ్యూటి..కేవలం నటనతోనే అభిమానులను మెప్పించాలి అనుకుంటుంది. అలానే చేస్తుంది కూడా. కోట్లు ఆఫర్ ఇచ్చిన కాంప్రమైజ్ కాకుండా..కచ్చితంగా తాను అనుకున్నది అనుకున్నట్లే చేస్తుంది.

ఇది వరకే రెండు సార్లు పవన్ సినిమాలో అవకాశం వస్తే వదులుకున్న ఈ బ్యూటీ.. ఈసారి మాత్రం ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. కానీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్ కాదట. నాట్య పరంగా ఓ కీలక పాత్రను పోషిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఎమిటంటే.. ఈ పాత్రకు పల్లవిని సెలక్ట్ చేసింది పవన్ అంటూ ఓ వార్త మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూడాలి పవన్ సినిమాలో ఈ లేడీ పవర్ స్టార్ పాత్ర ఎలా ఉంటూందో..ఎలా మెప్పిస్తుందో..?

Share post:

Latest