వామ్మో.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..పూజా రేట్ చూస్తే మైండ్ బ్లాకే..!

ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ ఎవ్వరు అంటే అందరు టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్. అమ్మడు అంటే పడి చచ్చిపోయే జనాలు చాలా మందే ఉన్నారు. ఓ స్టార్ హీరో కి సరిసమానంగా పూజా కు ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో అమ్మడు ఈ అభిమానాని బాగా క్యాష్ చేసుకుంటుంది.

తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూయిస్తుంది. ప్రజెంట్ ఒక్కో సినిమాకి 3 నుండి 4 కోట్లు తీసుకునే ఈ అమ్మడు..తన కోసం డిజైన్ చేసే డ్రెసులని కూడా స్పెషల్ గా చేయించుకుంటుందట. ఆ ఖర్చు కూడా నిర్మాతదే అనుకోండి. మళ్లీ అమ్మడుకి స్పెషల్ బాడీ గార్డ్స్.. వాళ్ళకి జీతం పూజా ఇచ్చినా..ఫుడ్ ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా ఆ సినిమా డైరెక్టర్ నే భరించాలట. ఇలా ఏ హీరోయిన్ కూడా పెట్టనన్ని కండీషన్స్ పెడుతూ నిర్మాతలను ముప్పు తిప్పలు పెడుతున్నా..పూజా నే కావలంటూ నిర్మాతలు ఆమె వెనక తిరుగుతున్నారు.

ఆమె హీరోయిన్ గా నటించిన బీస్ట్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అరబిక్ కుతూ పాట ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. కాగా, రీసెంట్ గా బడా నిర్మాత దిల్ రాజు అమ్మడుకి అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్-విక్టరి వెంకతేష్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో పూజా ని ఓ ఐటెం సాంగ్ కోసం దిల్ రాజు ఫిక్స్ చేశారట. ఇందుకోసం అమ్మడుకి అక్షరాలు కోటి 50 లక్షలు ఇస్తున్నారట. అంటే కేవలం మూడు నిమిషాల పాట కోసం..అనగా వన్ డే కాల్ షీట్ కోసం..కోటీ పుచ్చుకుంటుదనమాట పూజా. దీంతో ఇండస్ట్రీలోని మిగతా హీరోయిన్లు షాక్ అవుతున్నారు. ఈ పాట కూడా హిట్ అయితే పూజా రేంజ్ ఇక ఎక్కడికో వెళ్లిపోతుందంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular