సాయిపల్లవి హీరోను రిజెక్ట్ చేసిన కృతి..రీజన్ అదేనా..?

కన్నడ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి..వరుస హిట్ల తో మంచి జోరు మీద ఉంది. మెగా మేనల్లుడు తో ఉప్పెన అంటూ ఓ సినిమా లో నటించిన ఈ కుర్ర బ్యూటి మొదటి సినిమాతోనే తన తలరాతను మార్చేసుకుంది. అమ్మడు అదృష్టమో లేక మరేదైన మంత్రం వేసిందో తెలియదు కానీ కృతి శెట్టి కాళ్లు పెట్టిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో అమ్మడు నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది.

నాని తో శ్యామ్ సింగ రాయ్..నాగార్జున,నాగచైతన్య తో బంగార్రాజు సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం 8 సినిమాలకు పైగానే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే కోలీవుడ్ లో తన అదృష్టాని పరీక్షించుకోబోతుంది ఈ లక్కి గర్ల్ . డైనమిక్ డైరెక్టర్ బాల డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఓ సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మధ్య నే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి ని ఫిక్స్ చేస్తూ అఫిషీయల్ గా ప్రకటించారు మేకర్స్.

కాగా, రీసెంట్ గా కృతి.. హీరో శర్వానంద్ తో నటించే ఛాన్స్ వస్తే..రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో తో చేస్తే నాకు లాభం ఏముంది అనుకున్నిందో ..లేక కధ నచ్చలేదో తెలియదు కానీ దర్శకుడు కృష్ణ చైతన్యతో హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా కృతి ని అడిగితే ఆమె నిర్మోహమాటంగా నో చెప్పేసిందట. కాల్ షీట్లు ఖాళీ లేవు అంటూ స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేసిందట. కాగా, శర్వానంద్ హీరో సాయిపల్లవికి మంచి ఫ్రెండ్ ..వీళ్ళ కాంబోలో పడి పడి లేచే మనసు సినిమా వచ్చింది. కానీ బాక్స్ ఆఫిస్ వద్ద ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేకపోయింది.

Share post:

Popular