అరుంధ‌తి అవ‌కాశం బాల‌య్య మిస్ చేసుకున్నారా..?

ఇదో సంచ‌ల‌న విష‌యం. కానీ, నిజ‌మేన‌ని సినీ వ‌ర్గాలు చెబుతాయి. కోడి రామ‌కృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అరుంధ‌తి సినిమా.. సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. దీనిలో సోనూసూద్ పాత్ర ఇప్ప‌టికీ.. తెలుగు నాట నిలిచిపోయింది. వ‌ద‌ల బొమ్మాళీ.. అంటూ.. ఆయ‌న అనే డైలాగు.. ఇప్ప‌టికీ.. తెలుగు ప్రేక్ష‌కుల నోళ్ల‌పై నానుతూనే ఉంది. అయితే..అస‌లు ఈ పాత్ర‌ను మొద‌ట‌.. డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌.. బాల‌య్య‌ను దృస్టిలో ఉంచుకునే రాశారు.

ఈ విష‌యాన్ని ఆయ‌నే ఒక సంద‌ర్భంలో చెప్పారు. “అస‌లు ముందు మేం బాల‌య్య బాబు అనుకు న్నాం. అలా అనుకునే డైలాగుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. కానీ, అనూహ్యంగా ఆయ‌న ను తీసుకురాలేక పోయాం“ అని కోడి వివ‌రించారు. మ‌రి ఎందుకు బాల‌య్య ఈ సినిమాను మిస్ చేసు కున్నారు? ఆయ‌న వేయాల్సిన పాత్ర‌లోకి సోనూసూద్ ఎలా వ‌చ్చారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఈ పాత్ర అరుంధ‌తి సినిమాలో ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్. అప్ప‌టికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాల‌య్య హీరోగా ఓ రేంజ్‌లో ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో నెగిటివ్ రోల్‌. అందునా.. ఫుల్ లెంగ్త్ నెగిటివ్ అంటే.. బ్యాడై పోతాం.. అభిమానులు రిసీవ్ చేసుకోర‌ని భావించిన బాల‌య్య ఈ రోల్‌కు ఇష్టంలేద‌ని చెప్ప‌రాని..సినీ వ‌ర్గాల్లో ఒక వార్త హ‌ల్చ‌ల్ చేసింది. అంతేకాదు.. ఈ సినిమా అంతా హీరోయిన్ ఓరియెంట్ మూవీ. ఇది కూడా బాల‌య్య‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ఆయ‌న త‌న‌కు ఎంతో ఆప్త‌మిత్రుడు, కావాల్సిన ద‌ర్శ‌కుడే అయినా.. కోడి రామ‌కృష్ణ ఆఫ‌ర్ను తిర‌స్క‌రించారు.

ఇక‌, బాల‌య్య కాద‌న్నాక‌.. కోడి రామ‌కృష్ణ నెగిటివ్ రోల్ కోసం వెదుకుతున్న స‌మ‌యంలో ర‌జ‌నీ కాంత్ ద్వారా.. సోనూ సూద్ ప‌రిచ‌యం అయ్యార‌ట‌. దీంతో వెంట‌నే రోల్‌కు ఒప్పుకొన్నారు. ఇక‌, సినిమా విడుద‌లై. సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యాక‌.. బాల‌య్య వేసి ఉంటే.. బాగుండేది అని అనుకున్న సంద‌ర్భంగా కూడా ఉంద‌ని . సినీ వ‌ర్గాలు చెబుతాయి.