నయన్ బాయ్ ఫ్రెండ్ తో చేతులు కలిపిన మోనల్..ఏదో తేడాకొడుతుందే..?

మోనల్ గజ్జర్.. ఒకప్పుడంటే ఈ పేరుకి పరిచయం అవసరం కానీ..ఇప్పుడు ఆ పనిలేదు. సినిమాల్లో నటించి ఎంత మంచి పేరు సంపాదించుకుందో తెలియదు కానీ..బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూనే..ఓ వైపు అఖిల్ తో..మరో వైపు అభి తో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిపీ..వీకెండ్ లో హాట్ డ్రెసెస్ తో నాగ్ తో కాంప్లీమెంట్స్ అందుకుంటూ..అలా అలా మూడో వీక్ లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనల్..టాప్ 6 వరకు చేరుకుంది.

ఇక బిగ్ బాస్ తరువాత అమ్మడి జాతకం మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు హౌస్ నుండి బయటకు రాగనే ఇంటర్వ్యులు, ఆఫర్లు, సినిమాలు, డ్యాన్స్ షో లు అంటూ అబ్బో తెగ హడావిడి చేసింది. బెల్లకొండ శ్రీనివాస్ హీరో గా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో రంభ ఊర్వశి మేనక అంటూ అద్దిరిపోయే హాట్ పర్ ఫామెన్స్ కూడా ఇచ్చింది. అయితే, ఈ సినిమా తరువాత అమ్మడు కెరీర్ ఎక్కడికో పోతుంది అనుకున్నారు అంతా..కానీ అలా జరగలేదు. అమ్మడుకి సరైన ఆఫర్లు రాలేదు.

అయితే తాజాగా నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్‌ కన్ను ఆమె పై పడిన్నట్లు తెలుస్తుంది. పెళ్లి తరువాత పక్క ప్లానింగ్ లో దూసుకుపోవడానికి రెడీగా ఉన్న ఈ జంట..రీసెంట్ గా గుజరాతీ భాషలోను సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే..తమిళంలో విజయం సాధించిన ‘ఆండవన్‌ కట్టలై’ సినిమాని గుజరాతీ భాషలో రీమేక్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కడ స్టార్ హీరో మల్హర్‌ టక్కర్ హీరోగా ఫైనల్ చేయగా..హీరోయిన్ గా మోనల్ బ్యూటీ సెలక్ట్ చేసుకున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దీంతో తన సినిమా పై అఫిషియల్ ప్రకటన చేస్తూ..కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మోనల్ సినిమా మ్యాటర్ బయటపడింది. మరి చూడాలి అమ్మడు కి ఈ సినిమా అయినా మంచి పేరు తీసుకొచ్చి..బడా హీరోలతో నటించే అవకాశం అందుకుంటుందో లేదో..?

Share post:

Popular