ఎంపీనా… ఎమ్మెల్యేనా.. వంగ‌వీటి కొత్త అడుగులు…!

వంగ‌వీటి రాధా! ఈయ‌న‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. 2004లో ఒకే ఒక్క‌సారి విజ‌య‌వాడ తూర్పు నుం చి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న రాధా.. త‌ర్వాత‌.. అన్నీ.. ప‌రాజ‌యాల దిశ‌గానే అడుగులు వేశారు. పార్టీలు మార‌డం.. స్థిర‌మైన రాజ‌కీయాలు చేయ‌లేక పోవ‌డం.. ఇప్ప‌టికీ.. తండ్రి ఇమేజ్‌నే న‌మ్ము కుని ప్ర‌జ‌ల్లో తిర‌గ‌డం వంటివి ఆయ‌న‌కు మైన‌స్‌గా మారిపోయాయి. వాస్త‌వానికి ఏ పార్టీ అయినా.. ఒక అభ్య‌ర్థికి టికెట్ ఇవ్వాలంటే.. ఆఅభ్య‌ర్థి తాలూకు ఇమేజ్‌ను అంచనా వేసుకుంటాయి. కానీ, రాధా విష‌యానికి వ‌స్తే.. అన్నీ రివ‌ర్సే.. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వాలంటే.. రంగా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సి వ‌స్తోంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న రాధా.. త‌ర్వాత‌.. త‌న‌కు సెంట్ర‌ల్ నియో జ‌క‌వ‌ర్గం ఇవ్వ‌లేద‌నే గుస్సాతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీకి వ్య‌తిరేకంగా.. టీడీపీలో చేరి.. ప్ర‌చా రం చేశారు. ఇది వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రోవైపు.. రాధాకు.. ఎలాంటి ప్రాధాన్య‌మూ లేకుండా పోయింది. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి.. అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. పోనీ.. జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌న్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోటీడీపీతోనే.. ఈ పార్టీ కూడా పొత్తు పెట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాధా.. వ్యూహాత్మ‌కంగా టీడీపీలోనే ఉండిపోనున్నారు. అయితే.. టీడీపీలో ఉన్నా.. ఆయ‌న ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌న్న‌.. ఆయ‌న ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. దీంతో టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అవ‌కాశాల‌ను బ‌ట్టి.. వెళ్తే.. గుడివాడ వెళ్లాలి. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తానంటూ.. ఇప్ప‌టికిప్పుడే.. చంద్ర‌బాబు రాధాకు టికెట్ క‌న్ఫ‌ర్మ్ కూడా చేసేస్తారు.కానీ, రాధా ఇక్క‌డ నుంచి పోటీ చేసేఅ వ‌కాశం లేదు. త‌న ప్రాణ‌మిత్రుడు. మంత్రి కొడాలి నానికి ఇది కంచుకోట‌. ఇప్పుడు ఇక్క‌డ‌కు వెళ్లి.. రాధా ఉన్న స్నేహాన్ని.. చెడ‌కొట్టుకునే ప్ర‌య‌త్నం చేయలేరు. దీంతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాధాకు అవ‌కాశం లేదు.

ఇక‌, మిగిలింది.. ఏదైనా ఉంటే.. పార్ల‌మెంటునియోజ‌క‌వ‌ర్గం మాత్రం. కృష్ణాలో రెండు పార్ల‌మెంటు స్థానా లు ఉన్నాయి. ఒక‌టి మ‌చిలీప‌ట్నం.. రెండు విజ‌య‌వాడ‌. విజ‌య‌వాడ‌లో టీడీపీకి కేశినేనాని సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో.. ఇది రాధాకు ఇవ్వ‌డం సాధ్యం కాదు. అయితే.. మ‌చిలీప‌ట్నంలో మాత్రం ఆయ‌న‌కు ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత‌.. ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించ‌డంలే దు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాధా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డితే.. చంద్ర‌బాబు ఇచ్చే అవ‌కాశం ఉంది. కానీ, రాధా దీనికి అంగీక‌రిస్తారా? అనేది వేచి చూడాలి.

Share post:

Latest