జ్యోతిష్యుడి చెప్పిన ఆ మాట విని కోట్లు వదిలేసిన పెద్దాయన..!!

ప్రస్తుత సమాజం ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి..దేవుడి కంటే కూడా సైన్స్ నే ఎక్కువ నమ్ముతున్నారు. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళారా..పరీక్షలు బాగా రాస్తావు అంటూ ఇంట్లో అమ్మ చెప్పితే..”దేవుడి వచ్చి పరీక్ష రాస్తాడా మమ్మి..బీ ప్రాక్టికల్”అంటూ వెటకారంగా మాట్లాడే రోజులు ఇవి. ఈ రోజుల్లో జాతకాలు జ్యోతిష్యాలు అంటూ ఎవ్వరైనా చెప్పిలు నమ్మడం లేదు. కానీ, అప్పట్లో నందమూరి తారకరామారావు గారు..అలాంటి మాటలు విని లు రూపాయలను వదిలేసుకున్నాడు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

యస్.. పెద్దాయన కి ఇలాంటి జాతకాలు ..మూఢ నమ్మాకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ విషయంలో మాత్రం ఆయన గట్టిగా నమ్మి..కోట్లకి కోట్ల డబ్బును వదిలేసుకున్నాడు. మనకు తెలిసిందే పౌరాణిక పాత్రలు వేయడంలో ఎన్టీఆర్ మించిన నటులు లేరు ..రారు..రాబోరు. అంత చక్కగా కనిపిస్తాడు ఆ వేషంలో ఆయన మనకు. ఇక అలా ఆయన వేసిన ప్రతి గెటప్ జనాలను బాగా ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పాత్రలకు మరింత క్రేజ్ ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే లక్షల మంది అభిమానులు సినిమా థియేటర్ ముందు ఎదురు చూసారు.

అయితే ఆయన శివుడిగా నటించిన దక్ష యజ్ఞం అనే సినిమా 1962 లో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమా అంతా కూడా శివుడి పాత్ర చుట్టూనే ఉంటుంది. ఇక శివుడి వేషంలో ఎన్టీఆర్ ని చూస్తుంటే సాక్షాతు ఆ పరమశివుడినే దర్శించుకున్నే అనుభూతిని పొందేవారు జనాలు. సుమారు రెండేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని అందుకుని..మంచి వసూళ్లు రాబట్టింది. అప్పట్లోనే ఈ సినిమా 50 వ రోజు ఫంక్షన్ ను విజయవాడ లోని దుర్గా కళామందిరం హాల్ దగ్గర చేయాలని చిత్ర బృందం అనుకున్నారు. కానీ ఆ టైంలో సడెన్ గా ఆయన పెద్దకుమారుడు నందమూరి రామకృష్ణ చనిపోయారు. ఆ వార్త విన్న ఎన్టీఆర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న ఆయన బాధను ఏడుపును ఆపడం అక్కడ ఉన్న వారి వల్ల కాలేదు.

ఇక కొన్ని రోజుల తరువాత ప్రముఖ దర్శకుడు విఠాలాచార్య ఎన్టీఆర్ ఇంటికి ఓ జ్యోతిష్యుడితో వెళ్లారు. అప్పటికి ఎన్టీఆర్ ఇంకా రామకృష్ణ పోయిన బాధలోనే ఉన్నారు. ఇక అప్పుడు ఎన్టీఆర్ జాతకం చూసిన ఆయన ..”మీరు ఇంకెప్పుడు శివుడి వేషం వేయకండి. అలా వేస్తే మీరు లైఫ్ లో ఇంకా ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది”..అంటూ చెప్పారట. మొదట్లో ఈ మాటలు నమ్మని ఎన్టీఆర్..ఆ తరువాత విఠాలాచార్య అర్ధమైయ్యేలా చెప్పడంతో..జ్యోతిష్యుడి మాటలు విన్నాడట. ఇక అప్పటినుండి ..శివుడి వేషం వేయలేదట. అలా చాలా సినిమాలు వదిలేసుకుని కొన్ని కోట్ల రూపాయలను వదులుకున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాని బాలకృష్ణ సైతం ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు.