R R R టోట‌ల్ బ‌డ్జెట్ అంచ‌నాలు మించిందా… టెన్ష‌న్‌లో రాజ‌మౌళి…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహ‌బ‌లి – ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ సినిమాను ముందుగా రు. 250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు టైం కేటాయించారు ఇద్ద‌రు క్రేజీ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌. వాస్త‌వంగా చూస్తే ఈ ఇద్ద‌రు హీరోల రెమ్యున‌రేష‌న్ ఎంత లేద‌న్నా ఒక్కొక్క‌రికి రు.50 కోట్లు అంటే రు. 100 కోట్లు పై మాటే అంటున్నారు.

ఇక రాజ‌మౌళికి కాస్త అటూ ఇటూగా అంతే ఉంటుంద‌ని టాక్ ? ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ సినిమా మేకింగ్ పెట్టిన బ‌డ్జెట్‌తో పాటు రెండున్న‌ర సంవత్స‌రాలుగా నిర్మాణంలో ఉండడంతో భారీ వ‌డ్డీలు అన్నీ క‌లిపి ఈ సినిమాకు ఏకంగా రు. 500 కోట్ల బ‌డ్జెట్ అయిపోయింద‌ట‌. అస‌లు ఎక్క‌డ రు. 250 కోట్లు .. ఎక్క‌డ రు. 500 కోట్లు.. అంటే బ‌డ్జెట్ అనుకున్న‌దానికంటే మించిపోయింది. డ‌బుల్ అయ్యింది.

పైగా మూడు సార్లు రిలీజ్ డేట్లు మార్చారు. వ‌డ్డీలే చాలా వ‌ర‌కు సినిమా బ‌డ్జెట్‌ను తినేశాయ‌ని అంటున్నారు. అందువ‌ల్ల ఈ సినిమా రిలీజ్ టైంకు మ‌రీ అంత లాభాలు తీసుకువ‌చ్చే వెంచ‌ర్ అయితే కాద‌నే అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వ‌చ్చే వ‌సూళ్ల‌ను బ‌ట్టే ఈ సినిమా భారీ ప్రాపిట‌బుల్ వెంచ‌ర్ అవుతుందా ? కాదా ? అన్న‌ది తేల‌నుంది.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

అయితే ఈ సినిమాకు కొన్ని ప్ల‌స్‌లు కూడా ఉన్నాయి. నాన్ థియేటర్ రూపంలో 225 కోట్లు ఆదాయం వచ్చింది. ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక హక్కులు ఇచ్చేసారు. హిందీ లో నేరుగా విడుదల చేసుకుంటున్నారు. అక్క‌డ వ‌చ్చే వ‌సూళ్లు కూడా ఈ సినిమా స్థాయిని డిసైడ్ చేయ‌నున్నాయి. ఏదేమైనా రాజ‌మౌళి కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అటు నిర్మాత దాన‌య్య‌కు కూడా అలాగే ఉంద‌ట‌.