ఆ విష‌యంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ సేమ్ టు సేమ్‌… !

తెలుగు సినీ ప్ర‌పంచంలో అన్న‌గారు ఎన్టీఆర్‌.. అదేవిధంగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావులు చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఇద్ద‌రు ఒకే జిల్లాకు చెందిన వారు. అంతేకాదు.. ఇద్ద‌రూకూడా.. దాదాపు కొంత కాలం తేడాతో సినీరంగంలోకి వ‌చ్చిన‌వారే. అంతేకాదు.. ఇద్ద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి.. సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. తిరుగులేని నాయ‌కులుగా.. అనేక వంద‌ల సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రూ క‌లిసి కూడా న‌టించిన సినిమాలు ఒక‌టి రెండు ఉన్నాయి. చాణక్య చంద్ర‌గుప్త‌.. వంటివి.

అయితే.. అన్న‌గారు, అక్కినేనిలు ఎంత సినిమా రంగంలో ఉన్న‌ప్ప‌టికీ.. భావాలు వేరు.. అనుభ‌వాలు ఒక టే అయినా.. ఇద్ద‌రి వ్యూహాలు వేరు. ఒక‌రిపై ఒక‌రికి అభిమానం.. ఉన్న‌ప్ప‌టికీ… కొన్ని కొన్ని విష‌యాల్లో అక్కినేనిన‌ని అన్న‌గారు.. అన్న‌గారిని అక్కినేని విభేదించేవారు. ముఖ్యంగా రాజ‌కీయాల్లోకి అన్న‌గారు ప్ర‌వేశించ‌డాన్ని అక్కినేని చాలా వ‌ర‌కు ఒప్పుకోలేదు. అదొక రొచ్చు.. అనే వారు. అయిన‌ప్ప‌టికీ.. అన్న‌గా రు ప‌ట్టుబ‌ట్టి.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇక‌, అన్న‌గారు అధికారంలోకి వ‌చ్చాక కూడా.. ఏనాడూ రాజ‌కీయ ప‌ర‌మైన అవ‌స‌రాల కోసం.. ఇద్ద‌రూ ఎదురు ప‌డింది లేదు.

అయితే.. ఇన్ని విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ అక్కినేని-అన్న‌గారి విష‌యంలో ఒక కీల‌క‌మైన విష‌యం.. ఉండే ది. ఆ విష‌యంలోమాత్రం ఇద్ద‌రిదీ ఒకే దారి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారు. అదే.. ఆర్థిక విష‌యం. ఈ విష‌యంలో అన్న‌గారు.. అక్కినేని దాదాపు ఒకే దారిలో న‌డిచారు. రూపాయి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. త‌మ‌కు రావాల్సిన రూపాయిని ఖ‌చ్చితంగా అడిగి తీసుకునేవారు. అదేస‌మ‌యంలో ఎవ‌రినీ న‌మ్మేవారు కాదు. అంతేకాదు.. ఎక్క‌డైనా పెట్టుబ‌డి పెట్టాల్సి వ‌స్తే.. ఒక‌టికి రెండు సార్లు చ‌ర్చించుకుని పెట్టుబడులు పెట్టేవారు.

మ‌రీ ముఖ్యంగా స్థిరాస్తుల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చేవారు. అక్కినేని, అన్న‌గారు.. అనేక చోట్ల స్థ‌లాలు కొన్నారు.. చెన్నై, ముంబై, ఢిల్లీలోనూ ఇద్ద‌రికీ ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. (అన్న‌గారు చ‌నిపోయిన త‌ర్వాత‌.. వాటిని కుమారులు పంచుకున్నారు) అంతేకాదు.. అక్కినేని, అన్న‌గారిలో మ‌రో సంచ‌ల‌న అల‌వాటు కూడా ఉండేద‌ట‌. నిజానికి అంద‌రూ డైలీ డైరీ రాసుకుంటారుక‌దా! కానీ, వీరిద్ద‌రు మాత్రం ఏరోజు ఎంత ఖ‌ర్చు పెట్టాం.. ఎంత ఆదాయం వ‌చ్చింది..అనే విష‌యాల‌ను మాత్ర‌మే డైరీలో రాసుకునేవారు. ఇది వారిని ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ దిశ‌గా అడుగులు వేసేలా చేసింది. అందుకే వారు త‌ర‌త‌రాలకు త‌ర‌గ‌ని సంప‌ద‌ను వారి వారి కుటుంబాల‌కు ఇచ్చారు.

Share post:

Popular