ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. త్రిబుల్ ఆర్ కోసం వీరు తీసుకున్న పారితోషికం తెలిస్తే షాకే?

ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలైంది. ఇక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ప్రేక్షకులు అందరి కన్ను ఇప్పుఫు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా పైనే పడింది. ఇక ఈ నెల 25వ తేదీన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ ఐదు వందల కోట్ల బడ్జెట్ అయింది అన్నది తెలుస్తోంది. అయితే సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అన్న టాక్ కూడా చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. పదిహేను రోజులు మిగిలి ఉండగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇకపోతే ఇలాంటి సమయంలోనే ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి సహా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కొంతమంది తారాగణం రెమ్యునరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

అయితే త్రిబుల్ ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రీతిలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరో అజయ్ దేవగన్ 25 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇక రామ్ చరణ్ సరసన నటించిన ఆలియా భట్ తొమ్మిది కోట్లు పారితోషికం తీసుకుందట. ఈ సినిమాకు మూల స్తంభం అయిన కెప్టెన్ రాజమౌళి ప్రత్యేకమైన ప్యాకేజీ తీసుకోవడంతోపాటు లాభాల్లో 30 శాతం వాటా ఒప్పందం కుదుర్చుకున్నాడట. సీనియర్ హీరోయిన్ శ్రేయ కూడా కోట్లలో పుచ్చుకుంది అని తెలుస్తోంది. దీంతో పాటు మిగతా తారాగణం కూడా సాధారణ సినిమాలతో పోలిస్తే త్రిబుల్ ఆర్ సినిమా కి ఎక్కువగానే పారితోషకం ముట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest