RRR కోసం రాజమౌళి పారితోషకం..ఇండియాలో ఏ డైరెక్ట‌ర్‌ టచ్ కూడా చేయలేనంతా..?

రాజమౌళి.. సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం. ఇలాంటి డైరెక్టర్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేడు..ఇక పై రాబోరు అనడంలో సందేహం లేదు. కష్టపడితే విజయం దాని అంతట అదే వస్తుంది. ఈ ఫార్ములా ని బాగా నమ్ముతారు జక్కన. ఆయన తెరకెక్కించే సినిమా చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ప్రతి సీన్ ని కూడా క్షుణంగా పరిశీలించి..తనకు బాగా నచ్చితేనే ఆ సీన్ ని ఫైనల్ చేస్తాడు. ఆయన అనుకున్న విధంగా రాకపోతే ఎన్ని టేకులు అయినా తీసుకుంటాడు కానీ..కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అందుకే రాజమౌళిని అందరు జక్కన్న అని పిలుస్తుంటారు. ప్రతి సీన్ ని శిల్పి లా చెక్కాలి అనుకుంటారు.

ప్రజెంట్ ఆయన చరణ్-తారక్ లతో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రాని తెరకెక్కించాడు. దాదాపు నాలుగేళ్ళు కష్టపడి..ఎన్నో అవాంతరాలను ఎదురుకుని..ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా మార్చి 25 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెర పై చుద్దామా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రిలిజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ని జెట్ స్పీడ్ లో చేసుకుంటూ పోతున్నారు RRR టీం. పాన్ ఇండియా సినిమా కావడంతో ఏ భాషను కూడా వదలకుండా అన్నీ కవర్ చేస్తున్నారు చరణ్-తారక్-రాజమౌళి. కాగా, ఈ సినిమాకి రాజమౌళి పారితోషకంగా ఎంత తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా, మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జక్కన్న ఈ సినిమాకి సుమారు 400 కోట్లు పైనే తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. కేవలం ఈ సినిమా మేకింగ్‌ కోసమే దాదాపు రూ.336 కోట్లు ఖర్చు అయ్యాయని తెలుస్తుంది. అది కూడా డైరెక్టర్ హీరో,హీరోయిన్లు రెమ్యూనరేషన్లు పక్కన పెట్టి చూస్తే … ఇక హీరోల రెమ్యున‌రేష‌న్స్‌.. అంతా క‌లుపుకుంటే సుమారు 500కోట్ల పైమాటే. లేదా కొంచెం అటు ఇటుగా ఓ 600 కోట్లు అయ్యుండచ్చు అంటున్నారు. ఈ 600 కోట్లల్లో రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ లేదు. ఎందుకంటే..రాజ‌మౌళి సినిమా లాభాల్లో 30 శాతం ఇవ్వాల‌ని కండీష‌న్‌తో స్టార్ట్ చేశార‌ట‌. ఇప్పటి వరకు అందుతున్న టాక్ ప్రకారం ఈ RRR సినిమా అన్నీ భాషల్లోను , డిజిటల్ రైట్స్ అంతా కలుపుకుని సుమారు రూ.2000 కోట్లు రాబ‌టచ్చు అంటున్నారు. ఒక్కవేళ అదే నిజమైతే.. అందులో సినిమా మేకింగ్ కోసం పెట్టిన రూ.500 కోట్లు పోగా లాభం రూపంలో నిర్మాతలకి ఇంచుమించు రూ.1500 కోట్లు వ‌స్తాయి అనుకుంటే.. ఇక ఇందులో 30 శాతం రాజమౌళికి వెళ్లాలి. అంటే RRR సినిమా డైరెక్ట్ చేసినందుకు గాను రాజమౌళి అందుకునే పారితోషకం సుమారు రూ.450 కోట్లు. ఈ లెక్కలు కనుక నిజమైతే.. ఇప్పటి వరకు ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా తీసుకోని..టచ్ చేయలేని విధంగా రాజ‌మౌళికి రెమ్యునరేష‌న్ రూపంలో అందుకోబోతున్నాడనమాట. ఇంత మొత్తం రెమ్యున‌రేష‌న్‌గా అందుకోవ‌డం అంటే స్టార్ హీరో లకు మించిపోయిన్నట్లే జక్కన్న ..ఇది మామూలు విష‌యం కాదండోయ్‌.