‘రాధే శ్యామ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఇన్ని కోట్లు నష్టమా

బహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా హీరో గా మారిన ప్రభాస్ ఎన్నో ఆశలు మరెన్నో భారీ అంచానాల మధ్య రిలీజ్ అయిన సినిమా “రాధే శ్యామ్”. డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్షన్ లో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కారణం గా ప్రభాస్ దారుణమైన కమెంట్స్ పడాల్సి వచ్చింది. స్వయంగా ఆయన ఫ్యాన్స్ నే ఈ సినిమా చూసి వచ్చక..నీకు దండం పెడతాం డార్లింగ్ ఇలాంటి సినిమాలు తీయ్యకు..మమ్మల్ని బాధపెట్టకు అంటూ మీడియా ముఖంగా రివ్యూ ఇచ్చారు.

అందాల తార పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టాక్ పరంగా ఫ్లాప్ అయ్యింది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రభాస్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా చూసినంత డిజాస్టర్ రిజల్ట్ చూడలేదు. పాన్ ఇండియన్ అయినా కూడా అన్ని చోట్లా డిజాస్టర్ అయిపోయింది రాధే శ్యామ్. లక్ష్యానికి 120 కోట్ల దూరంలో ఆగిపోయింది ఈ చిత్రం. ఓవర్ ఆల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం..

ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్: 54.11 కోట్లు

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 7.65 కోట్లు

హిందీ: 10.50 కోట్లు

ఓవర్సీస్: 12.50 కోట్లు

క్లోజింగ్ వరల్డ్ వైడ్ టోటల్: 84.70 కోట్లు షేర్(151.50CR Gross)

204 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టిన ప్రభాస్ రాధే శ్యామ్ కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేక చేతులెత్తేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా హిందీలో 52.59 కోట్లకు అమ్మారు. కానీ లక్ష్యానికి దాదాపు 120 కోట్ల దూరంలో ఆగిపోయి అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది రాధే శ్యామ్. ఇప్పటికే థియేటర్ రన్ ముగిసిన ఈ చిత్రం ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Share post:

Latest