రాధేశ్యామ్ ప్లాప్‌.. త్రిబుల్ ఆర్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్ ప్రభాస్ నటించిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సినిమాల తర్వాత సాహో యాక్షన్ సినిమాలో ప్రభాస్ నటించాడు బాహుబలి రాజమౌళి మానియా తో ప్రపంచం గర్వించదగ్గ సినిమా రికార్డులు నిలిచిపోయింది బాహుబలి క్రేజ్ తో సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు వచ్చాయి.

తెలుగులో సాహో సినిమా అంచనాలు అందుకోలేదు అయితే బాహుబలి కి ఉన్న క్రేజ్ తో బాలీవుడ్లో ఆ సినిమాకు ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో సాహో బాక్సాఫీస్ దగ్గర ఆగిపోయింది.ఈ క్రమంలోనే సాహో తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పుడెప్పుడో ఆరు సంవత్సరాల క్రితం గోపీచంద్ తో దిల్ సినిమా తెరకెక్కించిన రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .పూర్తిస్థాయి ప్రేమ కథ చిత్రం కావడంతోపాటు ప్రభాస్ ఇమేజ్ కు సూట్ అయ్యే సినిమా కాదన్నా టాక్ అయితే వచ్చేసింది. అయితే సినిమాపై ఉన్న అంచనాలు నేపథ్యంలో ఓపెనింగ్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. చివరకు ప్రభాస్తో తనకున్న అనుబంధం నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి సైతం భారీగా ప్రమోషన్లు చేశారు.

లవర్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు మాస్ ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కు కూడా రాధేశ్యామ్ భయం వెంటాడుతోంది.రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమా ప్లాపు కావడంతో రేపు మరో భారీ పాన్ ఇండియా సినిమా గా వస్తున్నా త్రిబుల్ ఆర్ సైతం ఏం చేస్తది అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. అయితే ఆ సినిమాకు రాజమౌళి దర్శకుడు కావడంతో కొంత నమ్మకం ఉన్న సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చే వరకూ ఆ సినిమా నమ్మలేని పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చలు స్టార్ట్ అయ్యాయి.

Share post:

Latest