‘ రాధేశ్యామ్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ షేక్ అయ్యిందే..!

ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌. యూవీ క్రియేష‌న్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడేళ్ల పాటు ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ రెండు సినిమాలు, సాహో త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

పామిస్ట్రీ నేప‌థ్యంలో యూర‌ప్‌లోని ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థ‌పై ముందు నుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 7 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన రాధేశ్యామ్ మ‌న‌దేశంలో మొత్తం నాలుగు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి.

ఓవ‌ర్సీస్‌లో రిలీజ్‌కు ముందే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమాకు యూఎస్‌ ప్రీమియర్‌ షోస్‌ ద్వార 891k డాలర్స్‌ వచ్చాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఏరియాల వారీ పూర్తి వ‌సూళ్ల వివ‌రాలు రావాల్సి ఉంది. ఇక ఒక్క హైద‌రాబాద్ సిటీలో బొమ్మ ప‌డ‌కుండానే అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే ఏకంగా రు 6.5 కోట్లు వ‌సూళ్లు చేసింది.

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రు 202. 80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే రు. 200 కోట్ల షేర్‌.. రు. 300 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది.

Share post:

Popular