రాధేశ్యామ్ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… మిక్సీడ్ టాక్ వచ్చినా గట్టిగానే దంచాడు..!

సాహో సినిమా త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ మరియు పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ మార్చి 11న విడుదలైంది. మొదటి రోజు నుంచే సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. విజువ‌ల్ ఫీస్ట్ టాక్‌తో పాటు క్లాసిక్ ప్రేమ‌క‌థ అని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజుతో పాటు ఫ‌స్ట్ వీకెండ్‌లో అదిరిపోయే వ‌సూళ్లు ఈ సినిమాకు వ‌చ్చాయి.

తొలి రోజు రు. 71 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా 3 రోజుల‌కు 151 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ టాక్‌తో కూడా 3 రోజులు ఈ రేంజ్ వ‌సూళ్లు అంటే మామూలు విష‌యం కాదు. ఇక షేర్ విష‌యానికి వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి 2 రోజులకు 37.81 కోట్ల షేర్ వసూలు చేసింది. రాధే శ్యామ్ విషయానికి వస్తే, 3 రోజుల కలెక్షన్, సినిమా ప్రపంచ వ్యాప్తంగా ₹70 కోట్ల షేర్ వసూలు చేసింది.

భాష‌తో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలు, ఏరియాల్లోనూ అదిరిపోయే రేంజ్‌లో వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి అని, ఇక ఇప్పుడు థియేటర్లలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంద‌ని మేక‌ర్స్ చెపుతున్నారు. అయితే రు. 202 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయ‌డంతో ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రు. 100 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టాలి.

Share post:

Latest