క్లాస్ బ్యూటీతో పూరీ మాస్ మసాలా ఐటెం సాంగ్..”పుష్ప”కి అమ్మ మొగుడిలా ఉండబోతుందట..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన డైరెక్షన్లో సినిమాలు వస్తే బొమ్మా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అంత నమ్మకం పూరీ పై జనాలకు. పవన్ కల్యాన్ బద్రి సినిమా..మనం ఎన్ని సార్లు చూసిన ..చూసే ప్రతిసారి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్ రొమాంటిక్ గా సాగిపోయే మూవీలో ..నంద పాత్రను తీసుకొచ్చి పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ఘనత పూరీదే. సినిమాలోని ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తూ తెరకెక్కించడం పూరీ స్పెషాలిటీ

ఇక రవితేజ తో “ఇడియట్”. వామ్మో ఈ సినిమా పేరు చెప్పగానే కుర్రాళ్ళ లోపల మరో రవి తేజ బయటకు వస్తాడు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సంచలన విజయాలను నెలకొల్పింది. ఈ సినిమాలోని డైలాగ్ ఇప్పటికి మనం వాడుతుంటాం..” ఏ కమీషనర్ కూతుళ్లకి పెళ్లిల్లు అవ్వవ్వా..మొగుళ్ళు రారా..”? ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రోజు రవితేజ ఈ పోజీషన్లో ఉన్నారు అంటే దానికి కారణం పూరీ సినిమానులు అనడంలో సందేహం లేదు.

మరీ ఇలాంటి డైరెక్టర్ గత కొంత కాలంగా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టాడానికి చాలా కష్టపడుతున్నాడు. ఎలాగోలా “ఇస్మార్ట్ శంకర్” తో విజాయాని అందుకున్న పూరీ..ఇప్పుడు రౌడి హీరో విజయ్ దేవరకొండతో “లైగర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ మంచి మాస్ మసాలా ఐటెంగ్ సాంగ్ ఉందని..దానికోసం కుర్ర బ్యూటి వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ను సెలక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ అమ్మడికి అవకాశాలు లేవు, కనీసం పూరీ లాంటీ పెద్ద డైరెక్టర్ డైరెక్షన్ లో క్రేజీ హీరో విజయ్ తో ఐటెం సాంగ్ లో చేస్తే అయినా అమ్మడికి కొత్త ఆఫర్స్ వస్తాయని ఇలాంటి డెసీషన్ తీసుకున్నట్లుంది ఈ బ్యూటీ అంటున్నారు. ఇక ఈ పాటలో ఈ బ్యూటీ మరింత హాట్ గా కనిపించనుందని..పుష్ప ఐటెం సాంగ్ ను వెనక్కి నెట్టేలా ఈ పాట ను పూరి చిత్రీకరించబోతున్నాడని మేకర్స్ అంటున్నారు.