ప్రభాస్ పెళ్లి గురించి మహారాష్ట్ర జోతిష్యుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరో. బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సినిమాలో నటించిన యాక్టర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలు, తీయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టులే. ఇక ఆయనకు సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. ముందుగా ఆయన పెళ్లి గురించే ప్రస్తావన వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ కొనసాగుతున్నాడు. 42 ఏండ్లు వచ్చినా. . ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అని ఎవరైనా అడిగితే.. చేసుకుందాం అంటాడు తప్ప.. ఎప్పుడు? ఏంటి? అనే విషయాలను ఆయన బయటకు చెప్పడు. వాస్తవానికి బాహుబలి సినిమా తర్వాతే పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో ప్రభాస్ చెప్పాడట. కానీ ఇప్పటికీ ఇంకా ఆ ఆలోచన చేయడం లేదట.

ప్రస్తుతం ప్రభాస్ కు చెందిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో కూడా ఆయన పెళ్లి ప్రస్తావన వస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జోతిష్యుడు ఆచార్య వినోద్ కుమార్ పెళ్లి గురించి మాట్లాడారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అనే విషయాన్ని వెల్లడించాడు.

ప్రభాస్ వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. అక్టోబర్‌ 2022 నుంచి అక్టోబర్‌ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం ఉందన్నాడు. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో ఇది నా జ్యోతిష్యం అని వినోద్ వెల్లడించారు. అయితే తను చెప్పినట్లు ఏడాది లోగా ప్రభాస్ పెళ్లి అవుతుందా? అనే అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో ప్రభాస్ హస్త్ ముద్రికా నిపుణిడిగా కనిపించనున్నాడు. ఇటలీలో జరిగిన యధార్థగాథను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే జనాలను ఈ సినిమా అలరించబోతుంది.

Share post:

Popular