RRR ప్ర‌మోష‌న్ల యాక్ష‌న్ ప్లాన్ చూస్తే మైండ్‌బ్లాకే..!

భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా RRR. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో వస్తోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి రూపొందించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో వారం రోజులు మాత్ర‌మే ఉంది.

రాజ‌మౌళి టీం ప్ర‌మోష‌న్ల‌ను హోరెత్తిస్తోంది. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్ర‌మోష‌న్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే రేప‌టి నుంచి ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను మెట్రో న‌గ‌రాల్లోనూ, పెద్ద న‌గ‌రాల్లోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వాళ్లు ఓ ప్లానింగ్ కూడా రూపొందించుకున్నారు.

మార్చ్ 18 – హైదరాబాద్ మరియు దుబాయ్
మార్చ్ 19 – బెంగళూరు
మార్చ్ 20 – బరోడా మరియు ఢిల్లీ
మార్చ్ 21 – అమృత్‌సర్ మరియు జైపూర్
మార్చ్ 22 – కోల్‌కతా మరియు వారణాసి
మార్చ్ 23 – హైదరాబాద్ ప్రమోషనల్ ఈవెంట్

ఇక ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం రాజ‌మౌళి ఫ్యామిలీ ఏకంగా మూడేళ్లుగా ఎంతో క‌ష్ట‌ప‌డుతోంది.