యస్..చేతబడి చేయించా..సంచలన విషయాలను బయట పెట్టిన హాట్ బ్యూటి..!!

చేతబడి..ఏంటి రా బాబు ఈ రోజుల్లోను ఇలాంటివి నమ్ముతారా..నమ్మే వారు ఉన్నారా.. అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇలాంటివి నమ్మేవారు ఉన్నారు అని చెప్పక తప్పదు. 21 సెంచరీ లో ఉండి కూడా..ఈ మూడనమ్మకాలు ఏంటి అని ప్రశ్నిస్తే…వాళ్ల అమాయాకత్వం అనే చెప్పాలి. చదువు రాని.. వాళ్ళు ఇలా చేసారు అన్నా కూడా ఓ అర్ధం ఉంది. కానీ బాగా చదువుకున్న ..నటి గా మంచి పేరు తెచ్చుకున్న నటి కూడా ఇలా చేత బడి చేయించింది అంటే మీరు నమ్ముతారా..?

మీరు నమ్మిన నమ్మకపోయినా అది నిజం. ఈ మాట ఎవరో చెప్పటం కాదు.. స్వయం గా ఆ హీరోయిన్ నే చెప్పుకొచ్చింది. యస్..బాలీవుడ్ బ్యూటీ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ లాకప్ అనే సరికొత్త రియాలిటీ గేమ్ షో కు హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే . ఈ షో పాల్గొన్న కంటెస్టెంట్స్ వాళ్ల జీవితాలకు సంబంధించిన భయంకరమైన నిజాలు చెప్పుతూ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు బడా సెలబ్రిటీలు ఈ షో పాల్గోని సంచలన విషయాలను బయటపెట్టారు.

కాగా, రీసెంట్ గా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్‌ పాయల్‌ రోహత్గి ఎవరూ ఊహించని..ఊహించలేని ఒక సీక్రెట్ ని భయపెట్టి..అందరికి షాక్ ఇచ్చింది. అది విన్న కంటెస్టెంట్ లతో పాటు కంగనా కూడా షాక్ అవ్వడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే సినిమాలో అవకాశాల కోసం అమ్మడు ఎకంగా చేతబడి చేయించిందట. వింటుంటేనే ఓళ్లి వణికిపోతుంది కదా.. చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం చేతబడి చేయించానని ఆమె ఒప్పుకుంది.

ఆమె మాట్లాడుతూ ..”ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయ్యింది. కెరీర్ మొదట్లో అవకాశాలు బాగానే వచ్చినా ఆ తరువాత సదేన్ గా ఆగిపోయాయి. ఆ సమయంలో ఏం చేయాలి తోచలేదు. పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా అవకాశాలు రాబట్టాలని బాగా ట్రై చేశా. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో చేతబడి నే నమ్ముకున్నా. మీరు నమ్ముతారో లేదో అవకాశాల కోసం నేను చేతబడి కూడా చేయించాను. నా కెరీర్ వేగంగా పుంజుకోవాలని చెప్పి ఢిల్లీలోనే ఒక పూజారి సహాయంతో చేతబడిలోని వశీకరణ విద్యను నేర్చుకొని.. చాలామంది వద్ద ప్రయోగించాను. కానీ దాని వల్ల ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అవకాశాలు వచ్చేవి పోయేవి. అప్పుడే ఇలాంటివి నమ్మకూడదు అనుకున్నా..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Latest