ఇక్కడ ఇండస్ట్రీ హిట్.. అక్కడ అట్టర్ ఫ్లాప్.. పవన్ కళ్యాణ్ మూవీ ఏదంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే సగభాగం లీక్ అయినా కూడా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. సమంత , ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నదియా రావు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు.

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు. తొలిసారి ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం జరిగింది . అంతే కాదు ఇందులో ఆయన నటన ఒక ఫ్యాబులస్ అని చెప్పవచ్చు .సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా లీక్ అయినా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కు బ్రహ్మరధం పట్టారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఏకంగా 77 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి సూపర్ హిట్ కావడంతో పాటు రీమేక్ రైట్స్ ను కూడా కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో కలిసి లైకా సంస్థ ఏకంగా 35 కోట్ల రూపాయలకు ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. శింబు హీరోగా ఈ సినిమాను తమిళంలో సి సుందర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ , కేథరిన్ టేస్రా హీరోయిన్స్ గా నటించారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తమిళంలో కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోవడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు శింబు అభిమానులు కూడా పూర్తిగా నిరాశ చెందారు.

Share post:

Popular