పవన్ సినిమాలు వస్తాయా.. రావా?

పవర్ స్టార పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించాడు. ఇక భీమ్లానాయక్ ఇచ్చిన సక్సెస్‌తో పవన్ తన నెక్ట్స్ సినిమాలను పూర్తి చేస్తాడని అందరూ భావించారు. కానీ తనతో నెక్ట్స్ సినిమాలను లైన్‌లో పెట్టిన దర్శకనిర్మాతలకు పవన్ అదిరిపోయే షాకిచ్చాడని చెప్పాలి.

రీసెంట్‌గా జనసేన పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించిన పవన్, ఇకపై రాజకీయంగా జోరు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా 2024 ఎన్నికల కోసం ఇప్పటినుండే ప్రణాళికను రచించేందుకు పవన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో జూలై నెల నుండి పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో పవన్‌తో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

భీమ్లా నాయక్ సినిమా స్టార్ట్ కాకముందే పవన్ పలు సినిమాలను ఓకే చేశాడు. ఇందులో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా ఉన్నాయి. అయితే వీటి పరిస్థితి ఇప్పుడు డైలామాలో పడిందని చెప్పాలి. జూలై నెల నుండి పవన్ పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించనున్నాడు. దీంతో ఈలోపే ఈ సినిమాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది.

దీంతో పవన్‌ను నమ్ముకున్న దర్శకనిర్మాతల పరిస్థితి అయోమయంలో పడింది. వారు తమ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అనే సందేహంలో పడిపోయారట. అయితే ఇదంతా కేవలం పవన్ అంటే పడనివారు పుట్టిస్తున్న పుకార్లేనని, పవన్ పక్కా ప్లానింగ్‌తో తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి తీరుతాడని ఆయన అభిమానులు అంటున్నారు. మరి పవన్ ఓకే చేసిన సినిమాలు ఇప్పట్లలో వస్తాయా లేవా అనేది తెలియాలంటే మరికంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular