వామ్మో పవన్ కళ్యాణ్ కు.. ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయా?

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న వారు కోట్లకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇక ఎప్పుడూ ఆస్తులు పెంచుకునే పనిలో ఎంతో బిజీ బిజీగా ఉంటారు. సినిమా వాళ్ళని చూస్తే చాలు వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు సామాన్య ప్రజలు. మనలాగా అప్పులు ఆర్థిక ఇబ్బందులు అనేవి వాళ్ళకి అస్సలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా హీరోలకు కూడా అప్పులు ఉంటాయి అంటే ఎవరైనా నమ్ముతారా… అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కి అప్పులు ఉన్నాయి అని తెలిసిన కూడా ఎవరు నమ్మరు.

కానీనిజం ఏంటంటే పవన్ కళ్యాణ్కు అప్పులు ఉన్నాయన్నాయట. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరో గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పారితోషకం కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్లుగా గడిచినప్పటికీ పవన్ చేసింది మాత్రం చాలా తక్కువ సినిమాలు. అయినప్పటికీ ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ గా మారిపోయాడు. అయితే పవన్ ఒక్కో సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్నది తెలిసిందే. ఇక ఇలా భారీ రెమ్యూనరేషన్ తో ఆస్తులు కూడా పవన్ కు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. కేవలం ఆస్తులు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్కు అప్పులు కూడా ఉన్నాయి అంటూ ఒక టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో రాజకీయాలకు డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు దాదాపు యాభై కోట్ల వరకు పవన్ కళ్యాణ్ అప్పు చేశారట. ఇక ఇలా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించడం కోసం మళ్లీ ఇప్పుడు పెద్ద మొత్తం అవసరం కావడంతోనే ఇక ఆయనకు అన్నం పెట్టిన సినిమాలో వైపు అడుగులు వేశారు అని టాక్ వినిపిస్తుంది. మునుపెన్నడూ లేనంత వేగంగా ప్రస్తుతం సినిమాలకు ఓకే చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. మరీ ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest