బిగ్‌బాస్ షోలో మ‌మైత్ ఇంత చీఫ్ అయ్యిందా… ఇంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా…!

తెలుగు బిగ్ బాస్ షో ప్రతి సీజన్ కు సూపర్ హిట్ అవుతూ వస్తోంది. అయితే తొలి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఆ షోను సూపర్ హిట్ చేశారు. రెండో సీజన్ హోస్ట్ చేసిన నాని కూడా బిగ్ బాస్ ను సరికొత్త పుంత‌లు తొక్కించారు. ఈ రెండు చిత్రాలకు అదిరిపోయే టిఆర్పి రేటింగులు వచ్చాయి. మూడో సీజ‌న్‌ వరకు నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. మూడో సీజ‌న్ నుంచి బిగ్‌బాస్ హోస్ట్ మారక పోవడంతో కాస్త క‌ళ తప్పిందని చెప్పాలి. అయితే తెలుగు బిగ్ బాస్ షోకి వెళ్ళిన కంటెస్టెంట్లు బయటికి వచ్చాక బాగా పాపులర్ అవుతున్నారు

బిగ్ బాస్ షోలో కి వెళ్లిన వారిలో కొందరికి బయటకు వచ్చాక సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. మహిళా కంటెస్టెంట్ అయితే బోల్డ్‌ ఇంటర్వ్యూలు… హౌస్ లో ప్రేమాయణాలతో బాగా వార్తల్లో నిలుస్తున్నారు. మొత్తానికి వారు అనుకున్నట్టుగానే పాపులారిటీ, క్రేజ్‌ అయితే కంటెస్టెంట్ల‌కు వస్తుంది. ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వారిలో పురుషుల కంటే మహిళల కంటెస్టెంట్లే ఎక్కువగా పాపుల‌ర్ అవుతున్నార‌ని స్పష్టమవుతోంది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన హాట్ ఐటెం బాంబు ముమైత్ ఖాన్ తాజాగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌ నుంచి తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ అయన మ‌మైత్‌కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె అనూహ్యంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావలసి వచ్చింది. అయితే ఆమె ముందు నుంచి భయపడినట్టే జరిగింది. ఆమె హౌస్ లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే ఆట మీద కంటే ఎక్కువగా సింప‌తీ మీదే కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ప్రతి ఒక్కరి దగ్గర సింపతీ గేమ్ చేసేందుకే ఆట ఆడినట్టు కనిపించింది. ఏది ఏమైనా తొలివారంలోనే బయటకు వచ్చిన ఆమె తాను ఇంత త్వరగా బయటకు వస్తానని ఊహించలేదని స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యింది. ఇక తొలి వారం హౌస్ లో ఉన్నందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత ఇచ్చారు అన్నది కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది.

వారం రోజులు హౌస్ లో ఉన్నందుకు 80, 000 ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఒకప్పుడు ఒక ఐటమ్ సాంగ్ కి లక్షల పారితోషికం తీసుకుని.. ఇప్పుడు ఇంత చీప్ గా హౌస్ లోకి వెళ్ళింద‌న్న‌ కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ముమైత్ ఖాన్ కు తెలుగు సినిమాల్లో ఎంతో క్రేజ్ ఉండేది. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్న ఐటం సాంగ్ చేశాక ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆమె రెమ్యునరేషన్ అప్పట్లో లక్షల ఉండేది. అయితే ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోవడంతో చాలా చీప్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళింది అని అర్థమవుతుంది.

Share post:

Popular