తీవ్ర విషాదంలో మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌.. పెద్ద కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయ‌న కుమారుడు మృతి చెందారు. స‌త్య నాదెళ్ల పెద్ద కుమారుడు అయిన జైన్ నాదెళ్ల ( 26) ఈ రోజు ఉద‌యం మృతి చెందారు. జైన్ పుట్టుక‌తోనే అరుదైన కండ‌రాల వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చాలా యేళ్లుగా వీల్ ఛైర్‌కే ప‌రిమితం అయ్యాడు. అమెరికా కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే జైన్ మృతిచెందారు.

ఈ విష‌యాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న ఎగ్జిగ్యూటీవ్ సిబ్బందికి పంపిన ఈ మెయిల్‌లో చెప్ప‌డంతో పాటు జైన్ మృతికి సంతాపం కూడా తెలిపింది. స‌త్య నాదెళ్ల – అను దంప‌తుల‌కు పెద్ద సంతానంగా జైన్ ( 26) 1996లో జ‌న్మించాడు. అయితే జైన్ పుట్టుక‌తోనే తీవ్ర‌మైన సెరిబ్ర‌ల్ పార్సీ ( కండ‌రాల వ్యాధి)తో పుట్టాడు. అప్ప‌టి నుంచి ఎక్కువుగా వీల్ చైర్‌లోనే ఉంటూ వ‌చ్చాడు. దీంతో స‌త్య నాదెళ్ల కుటుంబంపై కుమారుడి కోసం ఎంతో కుంగిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఇలాంటి వాళ్ల కోసం అరుదైన ప‌రిక‌రాల‌పై దృష్టి పెట్టింది. ఇక స‌త్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాక కూడా అలాంటి వాళ్లు వాడుకునేలా మైక్రోసాఫ్ట్ ఉత్ప‌త్తుల్లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా తీసుకువ‌చ్చారు. ఇక జైన్ చిన్న‌ప్ప‌టి నుంచే మాన‌సిక‌, శార‌రీక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డేవాడు. మానసిక ఎదుగుద‌ల లేక‌పోవ‌డంతో అనేక ఇబ్బందులు త‌ప్ప‌లేదు.