సర్కారు వారి పాట పాడేసిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినమిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర వర్గాల్లో తాజాగా ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను మహేష్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక మహేష్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడని.. అయితే సమ్మర్ వెకేషన్ తరువాత ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన ఫుల్ బిజీగా ఉంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి నిజంగానే ఈ సినిమా షూటింగ్‌ను మహేష్ పూర్తి చేశాడా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular