రాజమౌళి పై కంగనా పోస్ట్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!!

దర్శకదీరుడు రాజమౌళి .. ఈయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలి అని అనిపిస్తుంటుంది. ఏం చెప్పినా కూడా..చెప్పడానికి ఇంకా ఏదో మిగిలి ఉన్నట్లే ఉంటుంది..అంతలా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ జక్కన్న. ఓ సినిమా ఎవ్వరైన తెరకెక్కిస్తారు..చేతులో డబ్బులు..ఓ టీం ను ఏర్పాటు చేసుకుని..ఏదో తూ.. తూ.. మంత్రంగా ఓ కధను తెరకెక్కించడం కాదు సినిమా అంటే..దానికోసం ఎంతో కష్టపడాలి..కష్టపెట్టాలి..అప్పుడే జనాలు ఆ సినిమాను ఇష్టపడతారు.. వచ్చే రెస్పాన్స్ చూసి మనం హ్యాపీ గా ఉండచ్చు..అనుకునే మెంటాలిటీ ఈ జక్కన్నది.

రీసెంట్ గా RRR సినిమా తో మరో తిరుగులేని విజయం అందుకున్న రాజమౌళి..దేశవ్యాప్తంగా ఆయన పేరు మారిమ్రోగిపోయేలా చేసుకున్నాడు. సినిమా పరంగా అక్కడక్కడ మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి..కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అన్నట్లు సరికొత్త రికార్డ్లను సృషిటిస్తున్నాడు. నాతో నాకే పోటి..నాకు లేరు సాటి అన్న రేంజ్ లో జక్కన్న దూసుకుపోతున్నాడు. ఇప్పటికే RRR సినిమా చూసిన స్టార్ సెలబ్రిటీలు అందరు సినిమాను తెరకెక్కించిన రాజమౌళిని..సినిమా నటించిన బిగ్ స్టార్స్..చరణ్-తారక్ లను తెగ పొగిడేస్తున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ కాంట్రవర్షీయల్ క్వీన్ కంగనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. జక్కన్నపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాజమౌళి ఫొటోను షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చింది..” ఇప్పటికి..ఎప్పటికీ రాజమౌళి సార్‌..మన ఇండియాన్ సినిమా గొప్ప డైరెక్టర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ చూడకుండా కెరీర్ ని ను కొనసాగిస్తున్న ఆయన ఇక పై కూడా తన కెరీర్ లో ప్లాప్‌ సినిమాలు ఉండవు. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది. మీలాంటి రోల్‌ మోడల్‌ ఉండటం అదృష్టం సార్‌..అంటూ నేను మీకు ఓ పెద్ద ఫ్యాన్ ని..ఖచ్చితంగా రేపు మీ సినిమా చూస్తా’ అంటూ కంగనా రాసుకొచ్చింది.” అంతా బాగానే ఉన్నా.. లాస్ట్ లైన్ లో అడ్డంగా దొరికిపోయింది కంగానా..ఇంత వరకు సినిమానే చూడలేదు..కానీ ఈ రేంజ్ లో రాజమౌళిని పొగిడేస్తున్నావ్..ఏంటి కంగానా ఇది అంటూ కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు..”నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తాడు అని ఏమో”అంటూ ఫన్ని ఎమోజీస్ తో కామెంట్స్ చేస్తున్నారు.