జూ.ఎన్టీఆర్ మహానటి సినిమాలో ఎందుకు నటించలేదంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కలిగిన నటుడిగా పేరు పొందారు. ఒకానొక సమయంలో ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటన్నిటినీ ఎదుర్కొని సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఇలాంటి ఎన్టీఆర్ ఒక మహా నటి అయినటువంటి సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి సినిమాలో ఎందుకు నటించలేదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్షన్ చేసింది డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు దర్శకుడు. ఇక ఈయన డైరెక్టర్ కాకముందు దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు. అలా మొదటిసారిగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చినప్పటికీ మహానటి లాంటి బయోపిక్ చిత్రాలు ఇప్పటివరకు రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కథని మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చూపించడం జరిగింది. ఈ చిత్రం చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటన అద్భుతంగా వుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె తోపాటు దుల్కర్ సల్మాన్ కూడా అంతే అద్భుతంగా నటించారు. ఇక నాగేశ్వరరావు స్థానంలో నాగచైతన్యను చూపించారు.. కానీ ఎన్టీ రామారావు పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించలేదు.

అయితే ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ ఎందుకు అలా చేశారని ప్రేక్షకులు అనుకున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఒక ప్రశ్న ఎదురైందట.. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి సంప్రదించాలని తెలిపారు అయితే ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే ఈ సినిమాలో ఎక్కువగా ఎన్టీ రామారావు సావిత్రి మధ్య సన్నివేశాలు ఉండేవని తెలియజేశారు. మొదట ఈ చిత్రంలో జెమినీ గణేషన్ రోల్ కి విజయ్ దేవరకొండను సంప్రదించాను కానీ చివరికి దుల్కర్ సల్మాన్ నటించాడని తెలియజేశారు.