జ‌న‌సేన ఇంత డిఫెన్స్‌లో ప‌డిపోయిందా… ప‌వ‌న్ ఆశ‌లు పోయాయా..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జ‌న‌సేన పార్టీ.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిందా? పార్టీ అధినేత‌.. ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో సాగుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. పార్టీ వ‌ర్గాలు. ము ఖ్యంగా జ‌న‌సేన పై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు జ‌న‌సేన‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే శాయ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయా? అనే ప్ర‌శ్న‌కు సోము ఓ కీల‌క స‌మాధానం చెప్పారు..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి రావాల‌నే కాంక్ష‌తో ప‌నిచేస్తోంద‌ని అన్నారు. అయితే.. వ‌స్తామ‌ని.. తాము న‌మ్మితే.. ఒక‌విధ‌మైన ప్లాన్ ఉంటుంద‌ని.. లేక‌పోతే.. మ‌రో ప్లాన్ తో తాము ముందుకు సాగుతామ‌ని చెప్పారు. కానీ, బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన మాత్రం.. వైసీపీని గ‌ద్దె దింపేందుకు.. పోరాటం చేస్తామ‌ని చెబుతోంది.మ‌రి.. బీజేపీ మాత్రం అప్ప‌టి ప‌రిస్థితులు బ‌ట్టి.. త‌మ రోడ్ మ్యాప్ ఉంటుంద‌ని.. స్ప‌ష్టం చేస్తోంది. అంతేకాదు.. చంద్ర‌బాబును సీఎం చేసేందుకు తాముక‌ష్ట‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని.. కూడా సోము వ్యాఖ్యానించారు.

“జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డం మా ల‌క్ష్యం ఒక్క‌టే కాదు. మేం అధికారంలోకి రావాల‌నేది.. ప్ర‌ధాన ల‌క్ష్యం. రెండో ది తీరుతుంద‌ని అనుకుంటే.. ముందుకు సాగుతాం. అంతేత‌ప్ప‌.. మొద‌టి దానికోస‌మే ప‌నిచే యాల్సిన అవ‌స‌రం కానీ.. ఎవ‌రినో.. సీఎం సీటులో కూర్చోబెట్టాల్సిన అగ‌త్యం కానీ.. మా పార్టీకి లేదు“ అని సోము కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంటే.. జ‌న‌సేన వ్యూహానికి పూర్తిగా భిన్నంగా.. సోము వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. ఇప్పుడుజ‌న‌సేన భావిస్తున్న‌ట్టుగా.. అయితే.. ప‌రిణామాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉండేలా క‌నిపించ‌డం లేదు.

బీజేపీ పుంజుకుంటే.. ఒక‌ర‌కంగా.. లేక‌పోతే.. మ‌రోర‌కంగా.. త‌మ రాజ‌కీయాలు మార్చుకుంటామ‌ని .. బీజేపీ చీఫ్ స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో జ‌న‌సేన చెబుతున్న వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల్చ‌కుండా.. అనే సూత్రాన్నిఈ పార్టీ విబేదిస్తున్న‌ట్టుగానే చూడాల‌ని అంటున్నారు మేధావులు. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ పుంజుకోవ‌డం.. క్షేత్ర‌స్థాయిలో ఓటు బ్యాంకును సొంతం చేసుకోవ‌డం అనేది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి. దీనిని బ‌ట్టి.. జ‌న‌సేన.. బీజేపీ విష‌యంలో ఏదైనా నిర్ణ‌యంతీసుకుంటేనే బెట‌ర్ అని అంటున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపైనా.. ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.