ఒక‌ప్ప‌టి హీరో వెంక‌ట్‌కు ఏమైంది… మూడు నెల‌లుగా ఆసుప‌త్రి బెడ్‌పైనే…!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే హీరోలు అందరికీ కూడా ఎన్నో చేదు అనుభవాలు ఊహించనీ అవమానాలు ఎదురవుతుంటాయి. కానీ వాటన్నిటినీ దాటుకుంటూ చిత్ర పరిశ్రమలో ముందుకు సాగుతూ ఉంటారు ఎంతో మంది. కొన్ని కొన్ని సార్లు వారు కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకోవటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో బాగా రాణించి ఆ తర్వాత కనుమరుగైన వారిని తన షో లోకి తీసుకురావడం ఇక వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం అంతకుమించిన ఆసక్తికర సమాధానాలు వారి నుంచి రాబట్ట డమే పనిగా పెట్టుకున్నారు కమెడియన్ అలీ.

ప్రస్తుతం ఈటీవీలో ఆలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇందులో అందరూ కూడా చిత్ర పరిశ్రమకు దూరమైన నటీనటుల ఎక్కువగా గెస్టులుగా వస్తూ ఉంటారు.. ఇకపోతే సీతారాముల కళ్యాణం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వెంకట్ ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. కెరియర్ విశేషాలను తెలిపారు. ఇక హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో చిరంజీవి హీరోగా వచ్చిన అన్నయ్య సినిమా లో చిరు తమ్ముడిగా కూడా నటించాడు
ఇక ఇందులో మెగాస్టార్ అతని జెమ్స్ అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత కూడా చాలామంది తనను జెమ్స్ అంటూ పిలవడం మొదలు పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు వెంకట్. ఇక పెళ్లయిందా అంటూ ప్రశ్నించగా.. ఇప్పటికీ నేను సింగిల్ అంటూ చెప్పేశాడు. తనకు చిన్నప్పటి నుంచి చదువు మీద ధ్యాస లేదు అంటూ చెప్పిన వెంకట్ మోడలింగ్ లోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను అంటూ తెలిపాడు. అయితే ఒక డాన్స్ మాస్టర్ తనను అందరి ముందు అవమానించాడని ఇతను దేనికి పనికి రాడు ఎక్కడినుంచి పట్టుకొచ్చారు అంటూ అందరి ముందే దారుణంగా కామెంట్స్ చేశాడని ఈ షోలో భాగంగా వెంకట చెప్పుకొచ్చాడు.

ఇక ఒకసారి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సమయంలో ఓ సినిమా షూటింగులో భాగంగా ఆయన చెంప చెల్లుమనిపించాడు అంటూ వెంకట్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ అయిదుగురు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని దారుణంగా గాయాలు అయ్యాయని మూడు నెలల పాటు ఆసుపత్రికే పరిమితం అయ్యా అంటూ వెంకట్ తెలిపాడు ఇలా ఈ షోలో భాగంగా తన కెరీర్ విశేషాలను అన్నింటినీ కూడా పంచుకున్నాడు వెంకట్.