‘భీమ్లా నాయక్’లో విలన్ గా చేయడానికి మెయిన్ రీజన్ ఇదే.. రానాకి ముందే తెలుసా..?

‘భీమ్లా నాయక్’..సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు దాటిన బాక్స్ ఆఫిస్ వద్ద పవర్ స్టార్ పవర్ మాత్రం ఇంకా తగ్గలేదు. అన్ని సినిమా ధియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తూన్నాయి. దీంతో బాక్స్ ఆఫిస్ వద్ద ‘భీమ్లా నాయక్’ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటి నుండి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా తనదైన స్టైల్లో తెరకెక్కించాడు సాగర్ చంద్ర. ఇక అదే విధంగా ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా డైలాగ్స్ రాసి మరోసారి పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాని చాటుకున్నాడు త్రివిక్రమ్.

ఈ సినిమా లో పవన్ నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్ కూడా బాగా పేలింది. ముఖ్యంగా డానియల్ కి భీమ్లా నాయక్ కి మధ్య వచ్చే ఘాటు మాటలు సినిమా కే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ఇంతటి భారీ విజయం అందుకోవడానికి మరో ముఖ్య కారణం మ్యూజిక్. ధియేటర్స్ లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వస్తున్నప్పుడు వినాలి అద్దిరిపోది అంతే. తమన్ మ్యూజిక్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎక్కడ కూడా వల్గారిటీ అనేదే లేదు. కుటుంబం అంత కలిసి కూర్చోని హ్యాపీ గా చూడచ్చు. అందుకే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడుతున్నారు.

అయితే, ఈ సినిమా సక్సెస్ అయిన సంధర్భంగా రానా ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అస్సలు ఆయన ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ కధనేనట. స్టోరీ వినగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రానా ముందే గెస్ చేశాడట . ఈ సినిమా స్టోరీ విన్నాకనే ఆయనకి ఇందులో పవన్ కల్యాణ్ హీరో అని తెలిసిందట. అంతకంటే ముందే రానా కి ఈ స్టోరీ నచ్చి కమిట్ అయిపోయాడట. అంతలా రానా ఈ కధను ఇష్టపడటానికి కారణం “ఇగో” అని చెప్పుకొచ్చారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే సెలక్ట్ చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్‌ మీద బేస్ చేసి తీసిన సినిమా అని..అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని క్లారిటీ ఇచ్చాడు రానా. ఇలాంటి డిఫరెంట్‌ జానర్ మూవీలోనూ హీరోయిజాన్ని అద్భుతంగా చొప్పించడం త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ చంద్రకే సాధ్యమైందని..దానికి తోడు పవన్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాకు యాడ్ అవ్వడం..దానికి తమన్ మ్యూజిక్ ఇవ్వడం అన్ని ‘భీమ్లా నాయక్’ సినిమా రూపురేఖలే మార్చేశాయని చెప్పుకొచ్చాడు.