పుష్పాలో విలన్ పాత్ర కోసం.. సుకుమార్ సంప్రదించిన 6 గురు హీరోలు వీరే !

గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి . కానీ పుష్ప సినిమా మాత్రం కాస్త డిఫరెంట్. అన్ని సినిమాల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎలా జరిగింది అని చూపిస్తే పుష్ప సినిమాలో మాత్రం కూలివాడు నుంచి ఏకంగా సిండికేట్ మొత్తాన్ని ఏలే వ్యక్తిగా పుష్ప రాజ్ అనే పాత్ర ఎలా ఎదిగింది అని చూపించారు. ఇక ఇలాంటి కథకీ లెక్కల మాస్టారు లాంటి సుకుమార్ టేకింగ్ తోడవడంతో ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు అటు సుకుమార్కి ఇటు అల్లు అర్జున్ కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. రష్మికకు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ.

పాన్ ఇండియా మూవీ అని మాటల్లో చెప్పుకోవడమే కాదు అదే రేంజ్ లో హిట్టు కూడా కొట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా కథకు ఎంతో కీలకం అని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సినిమా అయిపోయింది అని అనుకుంటూన్న సమయంలో చివరిలో వచ్చే బాన్వర్ సింగ్ షకావత్ అనే పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ లెక్కల మాస్టర్ సుకుమార్ మాత్రం ముందుగా ఈ పాత్ర కోసం కొంత మంది హీరోలను అనుకున్నాడట. ఇక వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

విక్రమ్ : విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే విక్రమ్ ను విలన్ పాత్ర కోసం అనుకున్నారట సుకుమార్. కానీ ఏమైందో ఇక విక్రమ్ నో చెప్పేశాడట.

విజయ్ సేతుపతి : ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతినీ పుష్ప సినిమాలో కూడా విలన్గా అనుకున్నాడట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంవల్ల సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నాడు.

జిష్ణు సేన్ గుప్తా : వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా ని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించాడట సుక్కు. కానీ అతను కూడా నో చెప్పాడట.

మాధవన్ : చివరికి మాధవన్తో అయినా సరే ఈ విలన్ రోల్ చేయిస్తే బాగుంటుందని సుకుమార్ కాలిక్యులేషన్స్ వేసుకున్నాడట. కానీ ఇక అతను కూడా సెట్ అవ్వలేదట.

ఆర్య : హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పించిన తమిళ హీరో ఆర్యను పుష్పాలో విలన్ గా మార్చాలని అనుకున్నాడట సుకుమార్. కానీ అతను మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది.

బాబీ సింహ : చిట్టచివరికి ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహంను కూడా పుష్ప సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించాడట. ఏం జరిగిందో అతడు కూడా సెట్ అవ్వలేదు ఇక చివరికి తమిళ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ పాత్ర కోసం ఫైనల్ అయిపోయాడు.

Share post:

Latest