బాల‌య్య జ‌న‌తా గ్యారేజ్ సినిమా రిజెక్ట్ చేసింది అందుకేనా ?

టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న క్రేజీ ద‌ర్శ‌కుల‌లో కొర‌టాల శివ ఒక‌రు. రాజ‌మౌళిలా అప‌జ‌యం అన్న‌ది లేకుండా కొర‌టాల వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. మిర్చితో 2013లో కొర‌టాల కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఇండ‌స్ట్రీ అంతా కొర‌టాల వైపు చూసేలా చేసింది. ఆ త‌ర్వాత 2015లో మ‌హేష్‌బాబుతో శ్రీమంతుడు సినిమా చేశాడు. శ్రీమంతుడు సాధించిన విజ‌యం మామూలు విజ‌యం కాదు. గ్రామాల ద‌త్త‌త కాన్సెఫ్ట్ తీసుకున్న కొర‌టాల మాంచి సోష‌ల్ మెసేజ్‌తో అద‌ర గొట్టేశాడు.

శ్రీమంతుడు మ‌హేష్‌బాబు కెరీర్‌కు మాంచి ఊపిరి లూదింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో 2016లో జ‌న‌తా గ్యారేజ్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ రెండూ కూడా సోష‌ల్ మెసేజ్ ఉన్న సినిమాలే. ఆ త‌ర్వాత మ‌రోసారి మ‌హేష్‌బాబుతోనే భ‌ర‌త్ అనేనేను సినిమా తీసి మ‌రో హిట్ కొట్టాడు.

ఇంకా చెప్పాలంటే మ‌హేష్‌బాబుతో పొలిటిక‌ల్ లైన్ తీసుకుని.. మహేష్‌ను సీఎంగా చూపించి హిట్ కొట్టడం కొర‌టాల‌కే చెల్లింది. ఇక తాజాగా కొర‌టాల చిరంజీవి – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఆచార్య తీశాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో తీసిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో మోహ‌న్‌లాల్ పాత్ర‌కు బాల‌య్య‌ను తీసుకుంటే ఎలా ఉంటుంది ? అన్న చ‌ర్చ‌లు ముందు జ‌రిగాయ‌ట‌.

ఈ పాత్ర‌కు స‌హ‌జ‌సిద్ధంగా ఉండే న‌టుడు కావాల‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న్ను ఎంపిక చేసిన‌ట్టు కొర‌టాల ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే బాల‌య్య – ఎన్టీఆర్ ఒకే సినిమాలో ఉంటే అది భీభ‌త్స‌మైన కాంబినేష‌న్ అవుతుంద‌ని.. అంచ‌నాలు ఎక్కువుగా ఉంటాయ‌ని. అందుకు త‌గిన క‌థ రాసుకోవాల‌ని అప్పుడే వారిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమాకు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని కొర‌టాల చెప్పాడు. బాల‌య్య – ఎన్టీఆర్ క‌లిసి చేస్తే చాలా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ ఉండాల‌న్న‌దే కొర‌టాల చెప్పిన మాట‌.