పవన్ పద్ధతి బాగోలేదబ్బా..ఏదో తేడాగా ఉందే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ RRR. ఒకటి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ను తెరకెక్కించడం సగం ప్లస్ అయితే.. RRR చిత్రంలోని ఇద్దరు టాప్ హీరోలు మల్టీ స్టారర్ గా నటించి మెప్పించడం మరో ప్లస్ పాయింట్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ లన్ని తిరగరాసింది RRR.

ఈ మాగ్నమ్ ఓపస్ RRR సినిమా ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసింది. ఇప్పటికే పలువు బడా స్టార్స్ ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళిని..ఈ సినిమా నటించిన తారక్-చరణ్ ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఇప్పటికీ కొంతమంది పెద్ద తెలుగు తారలు..బడా ప్రముఖులు ఈ RRR సినిమా పై.. వారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక వారిలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.

నిజం చెప్పాలంటే రాజమౌళికి.. పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తుందని..గతంలో ఓ సినిమా విషయంలో వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని..అప్పటి నుండి ఆ వార్ అలా కంటిన్యూ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ రాజమౌళిని తెరకెక్కించిన బాహుబలిని చాలాసార్లు పవన్ బహిరంగంగానే పొగిడేశారు. భారతీయ బాక్సాఫీస్‌పై ఈ అద్భుతమైన అధికారంతో తెలుగు సినిమాలు మరియు తెలుగు ప్రజలు గర్వించేలా చేసినందుకు రాజమౌళిని తన తీవ్రమైన కథా కథనాల ద్వారా ప్రశంసించారు. కానీ, ఇప్పటి వరకు RRR సినిమా పై ఎటువంటి మాట మాట్లాడలేదు లేదు. పైగా తన అన్న కొడుకు నటించిన సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయితే..ఇప్పటి వరకు పవన్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ కల్యాణ్ మౌనం వెనుక ఏదో తేడా కొడుతుంది అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

“RRR” విడుదలకు ఒక వారం ముందు నుండి వరకు పవన్ తన రాజకీయ పనులతో బిజీగా ఉన్నాడు. అయినా కానీ అన్న కోడుకు సినిమాని అన్న తమ్ముడు ఇద్దరు కలిసి చూస్తారని..అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన ఈ సినిమాని చూడలేదు. అసలు ఇప్పటివరకు సినిమా చూశాడో లేదో కూడా తెలియదు. ఇక RRR సినిమా పై పవన్ ఎప్పుడు ట్వీట్ చేస్తారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి పవన్ ఈ సినిమా పై ఎప్పుడు రియాక్ట్ అవుతాడో..?

Share post:

Latest