RRR తార‌క్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే మొద‌లైన రగడ…!

టాలీవుడ్‌లోనే తిరుగులేని యంగ్ క్రేజీ స్టార్స్‌గా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. సినిమా పోస్ట‌ర్స్ రిలీజ్ అవుతుండ‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా ఆ ఫోటోల‌ను మార్పింగ్ చేసేసి మా హీరోయే గొప్ప అంటే మా హీరోయే గొప్ప అన్న ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి రోజు సినిమా రిలీజ్ అయ్యాక ఏ హీరో పాత్ర కొంచెం త‌గ్గిన‌ట్టు అనిపించినా ఆ హీరోల అబిమానులు థియేట‌ర్ల దగ్గ‌ర‌, సోష‌ల్ మీడియాలో మామూలు రచ్చ చేయ‌ర‌నే అనుకోవాలి.

అయితే సినిమా రిలీజ్‌కు మ‌రో 12 రోజుల టైం ఉండ‌గానే అప్పుడే బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోలు, టిక్కెట్ల కోసం రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానులు పెద్ద యుద్ధానికే దిగుతున్నారు. ఇటు తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో , అటు ఏపీలో ఇప్ప‌టి నుంచే ఈ షోల కోసం త‌మ‌కు తెలిసిన వాళ్ల‌తోనూ, అటు పొలిటిక‌ల్‌గాను ప్రెజ‌ర్ తీసుకు వ‌స్తున్నారు. బెనిఫిట్ షోల‌ను ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని పంతాల‌కు పోతున్నారు.

పైగా టిక్కెట్ల విష‌యంలోనూ త‌మ‌కే ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాల‌ని నానా ర‌చ్చ చేస్తున్నారు. దీంతో అటు రాజ‌కీయ నేత‌ల ఒత్తిళ్ల‌తో పాటు ఇటు అభిమాన సంఘాల నేత‌ల ఒత్తిళ్ల‌తో థియేట‌ర్ల య‌జ‌మానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో ఏ పాత్ర‌కు కాస్త ప్రాధాన్యం త‌గ్గిన‌ట్టు ఉన్నా కూడా ఆ హీరోల అభిమానులు మామూలుగా రెచ్చిపోర‌నే చెప్పాలి. మ‌రి రాజ‌మౌళి ఏం చేశాడో ? చూడాలి.

Share post:

Latest