భీమ్లానాయ‌క్ 14 రోజుల వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా కాంబోలో తెర‌కెక్కిన సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంట‌ర్టైన్‌మెంట్ వారు భీమ్లానాయ‌క్ పేరుతో తెర‌కెక్కించారు. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌త నెల 25న రిలీజ్ అయ్యింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు మ‌రీ త‌క్కువుగా ఉండ‌డంతో చాలా చోట్ల ఏపీ వ‌ర‌కు బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఓవ‌ర్సీస్‌లో అయితే ఈ సినిమాకు భారీ లాభాలు వ‌చ్చాయి. ఇక రెండు వారాలు పూర్తి చేసుకున్న భీమ్లానాయ‌క్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 95.70 కోట్ల షేర్ రాబ‌ట్టింది.
అలాగే రు. 155. 75 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రు. 34.62 కోట్లు – ఉత్త‌రాంధ్ర 7.53 కోట్లు – ఈస్ట్ 5.44 కోట్లు – వెస్ట్ 4.95 కోట్లు – గుంటూరు 5.19 కోట్లు – కృష్ణా 3.76 కోట్లు – నెల్లూరు 2.53 కోట్లు – ఓవ‌రాల్‌గా ఏపీ ,, తెలంగాణ‌లో 75.02 కోట్ల షేర్ ( రు. 114.60 కోట్ల గ్రాస్‌) వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా నైజాం, ఓవ‌ర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఇక ఏపీలో మాత్రం సీడెడ్‌, ఉత్త‌రాంధ్ర ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలోనే ఉంది.

రాధేశ్యామ్‌కు నెగిటివ్ టాక్ వినిపిస్తుండ‌డంతో మ‌ళ్లీ భీమ్లా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పుంజుకుంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.