బాల‌య్య వెంట ప‌డుతోన్న చిరు.. అలా ఫిక్స్ అయ్యాడుగా…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. చిరు న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లానింగ్‌లో ఉన్నాయి. ఆచార్య ఏప్రిల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే గాడ్‌ఫాద‌ర్ సినిమా, ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ భోళా శంక‌ర్ సినిమా వ‌స్తుంది. ఆ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించే 154వ సినిమా లైన్లోకి వెళుతుంది.

ఇక గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. భోళా శంక‌ర్ సినిమాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా చిరు ప‌క్క‌న హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చెల్లిగా న‌టిస్తోంది. ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాకు శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక ఆయ‌న సినిమాల‌కు హీరోయిన్ల కొర‌త ఏర్ప‌డింది.

అయితే బాల‌య్య న‌టించిన‌.. న‌టిస్తోన్న హీరోయిన్ల వెంటే చిరు ప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్యం. బాల‌య్య‌తో గ‌తంలో న‌టించిన న‌య‌న‌తార‌ను మోహ‌న‌రాజా సినిమాలో హీరోయిన్‌గా సెట్ చేసుకున్న చిరు.. ఇప్పుడు త‌న 154వ సినిమాకు శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. శృతీ బాల‌య్య‌తో ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ సినిమాలో చేస్తోంది.

ఒకానొక ద‌శ‌లో ఫేడ‌వుట్ అయిన శృతి గతేడాది వ‌చ్చిన ర‌వితేజ క్రాక్ సినిమాలో న‌టించింది. ఇక ఇప్పుడు ఆమె చిరు ప‌క్క‌న హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. తాజాగా అందుకు సంబంధించిన పోస్ట్ తో పాటుగా ఫోటో ను షేర్ చేశారు మెగాస్టార్. ఇక చిరు ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Popular