జ‌య‌మ్మ పంచాయతీకి సుమ‌కు క‌ళ్లు చెదిరిపోయే రెమ్యున‌రేష‌న్‌..!

బుల్లితెర‌పై నెంబ‌ర్ వ‌న్ యాంక‌ర్ ఎవ‌రంటే సుమ పేరు గుర్తుకు వ‌స్తుంది. రెండు ద‌శాబ్ద‌లుగా ఎంత‌మంది యాంక‌ర్లు వ‌చ్చినా సుమ బుల్లితెర‌ను ఎలా ఏలేస్తుందో ? చూస్తూనే ఉన్నాం. సుమ మ‌ళ‌యాళీ అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె ఇప్పుడు మంచి యాంక‌ర్‌గా ఉన్నా కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఆమె తొలి సినిమా వ‌క్కంతం వంశీ హీరోగా దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సుమ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి ప‌రిచ‌యం చేసిన హీరోయినే.

ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా మారాక ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె కొన్ని సినిమాలు చేసినా ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేదు. యాంక‌రింగ్ చేసుకుంటూనే కాలం గ‌డిపేసింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత సుమ మ‌ళ్లీ వెండితెరంగ్రేటం చేస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్న “జయమ్మ పంచాయితీ”లో సుమ టైటిల్ రోల్ పోశిస్తుంది.

ఇప్ప‌టికే టైటిల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం సుమ‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది. మామూలుగా ఒక్కో ఈవెంట్‌కు సుమ రు. 2-3 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. ఇక టీవీలో కూడా ఒక్కో ఎపిసోడ్‌కు ఆమె రు. ల‌క్ష‌కు త‌గ్గ‌కుండా ఛార్జ్ చేస్తుంద‌ట‌. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఆమె ఏకంగా జ‌య‌మ్మ పంచాయ‌తీ సినిమాకు రు. 50 లక్షల వరకు ఛార్జ్ చేసిందట. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా ఇంత మొత్తంలో ఇచ్చారట‌.

ఒక‌వేళ ఈ సినిమా థియేట‌ర్స్‌లో వ‌ర్క‌వుట్ కాక‌పోయినా.. టీవీల్లోనూ, డిజిట‌ల్ మీడియా, ఓటీటీల ప‌రంగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న‌దే నిర్మాత‌ల ధీమా అట‌.