ఇంటికి దూరంగా ఉన్న సమంత..రీజన్ తెలిస్తే నవ్వేస్తారు..?

స్టార్ హీరోయిన్ సమంత..క్షణం కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ..కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. ఇక మనకు తెలిసిందే..చైతన్యతో విడాకుల తరువాత సమంత కొత్త కొత్తగా ఏదో తేడాగా బీహేవ్ చేస్తుంది అంటున్నారు నెటీజన్స్. నచ్చిన్నట్లు చేయడం..మంచి పనే..కానీ ఇష్టమొచ్చిన్నట్లు తిరగడం..ఏంటి..అంటూ మండిపడుతున్నారు.

ఇక సమంత అవి ఏం పట్టించుకోకుండా..నా లైఫ్ నా ఇష్టం అంటూ ముందుకు వెళ్తుంది. కాగా సమంత చేతిలో అరడజనుకు పైగా సినిమాలు చేతిలో ఉండగా.. ప్రస్తుతం ఆమె హరి, హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘యశోద’లో నటిస్తోంది. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత పాత్ర ఢిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటికే ఓ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు 3 కోట్లు ఖర్చు చేసి.. పెద్ద హోటల్ లాగ ఉండే సెట్ కూడా వేశారట.

దాదాపు ఆ సెట్ లోనే 40 – 60 శాతం సినిమా షూటింగ్ జరుగుతుందన్నట్లు తెలుస్తుంది. కళ్ళు చెదిరే విధంగా సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ సౌకర్యాలను తలపించేలా సెట్స్‌ వేసారట టీం. ఈ సినిమాకి ఈ సెట్ బ్యాక్ గ్రౌండ్ నే హైలెట్ అవుతుందని అంటున్నారు చిత్ర బృందం. ఇక ఈ సెట్ సమంత కి కూడా బాగా నచ్చేసిందట. అందుకే కొన్ని రోజులు ఆమె తన ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఆ సెట్ లోనే ఉండాలని డిసైడ్ అయ్యిందట. ఇక అక్కడే ఉంటే త్వరగా షూటింగ్‌కు రెడీ అవొచ్చన్న ఉద్దేశ్యంతో సామ్‌ కొన్నిరోజులపాటు అక్కడే ఉండనున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది సమంత చెప్పితేనే తెలుసుకోవాలి..

Share post:

Popular