ఆ హీరోయిన్ లా తప్పు చేయనంటున్న కృతి..పరువు తీసేసిందిగా..?

సినీ ఇందస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అవి రెండు పుష్కలంగా ఉన్న హీరోయిన్ కృతిశెట్టి. మొదటి సినిమానే మెగా హీరో తో చేయడం అంటే మామూలు విషయం కాదు దానికి నిజంగా ఎంతో లక్ ఉండాలి. ఇక అలా కలిసి వచ్చిన లక్ ని మిస్ చేసుకోకుండా కరెక్ట్ టైంలో ఖచ్చితంగా ఆ అవకాశాని ఉపయోగించుకున్న వారే సినీ ఇండట్రీలో సెటిల్ అవ్వగలరు. ఇప్పుడు అదే పనిలో ఉంది కృతి.

మెగా హీరోలతో సినిమాలు చేసిన వారంతా టాప్ హీరోయిన్లు అవ్వాలని లేదు. గతంలో చరణ్ ఫస్ట్ సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించన నేహా శర్మ..ప్రస్తుత పరిస్ధితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. మెగా హీరో తో సినిమా చేసి హిట్ కొట్టిన తరువాత కూడా ఆమె కెరీర్ అలా అయ్యిందంటే ..అప్పట్లో అమ్మడు సరైన సినిమాలు చూస్ చేసుకోలేదు..వచ్చిన అవకాశాలని మిస్ చేసుకుంది. కానీ కృతి శెట్టి అలా కాదు..పక్క ప్లానింగ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. అందుకే కుర్ర హీరోల సినిమాలకే కమిట్ అవుతూ సైన్ చేస్తుంది.

సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వదులుకుంటుంది. దానికి కారణం లేకపోనూలేదు .. అమ్మడు ఇప్పుడే అలాంటి సీనియర్ హీరోల పక్కన నటిస్తే వయసు ఎక్కువుగా కనిపించడమే కాకుండా కొద్ది రోజుల్లోనే డిమాండ్ తగ్గిపోది అంటూ సీనియర్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తుందట. అలా చేయడం వల్ల జనాల్లో కూడా నెగిటివిటీని సంపాదించుకున్నట్లు అవుతుందని..శ్రీలీల విషయానికి ఉదాహరణకు చెప్పుతుందట. రెండో సినిమా కే రవితేజ పక్కన నటిస్తూ అన్నా చెల్లెల్లులా ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో తనలా ఆ తప్పు తాను చేయనంటుందట ఈ కన్నడ బ్యూటీ. ఇక దీని బట్టి చూస్తే కృతి ఇప్పట్లో స్టార్ హీరో సినిమాలకి సైన్ చేసేటట్లు కనిపించట్లేదు అంటున్నారు నెటిజన్స్. ఒక రకంగా అది మంచి నిర్ణయమే అయినా..పాపులారిటీ ఉన్నప్పుడే స్టార్ హీరోలతో చేసే అవకాశం వస్తుంది.. టైం బ్యాడ్ అయ్యి కృతికి రెండు మూడు ఫ్లాప్ సినిమాలు పడితే ..ఆ నాలుగు అవకాశాలు కూడా ఇవ్వరు డైరెక్టర్స్..అది గుర్తుపెట్టుకుని డెసీషన్స్ తీసుకుంటే కృతికే మంచిదంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూద్దాం ఏం చేస్తుందో..?