మరో మంట పెట్టిన సమంత..చైతన్య పరువు పాయ్యే..?

టాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ సెలబ్రిటీ కపుల్ ..నాగచైతన్య-సమంత వేరు వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రాణాంగా ప్రేమించుకున్న ఈ జంట..పెద్దలను ఒప్పించి ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి పెళ్లి ధూమ్ ధామ్ అని కుటుంబసభుల మధ్య ఓ పండగలా జరిగింది. సమంత క్రిస్టియన్ కావడంతో..పెళ్లిని తెలుగు సాంప్రదాయ పద్ధతిలోను..అలాగే క్రిస్టియన్ పద్ధతిలోను జరిపించారు నాగార్జున. ఆయన ఏం చేసినా నాగ చైతన్య హ్యాపీ గా ఉండాలనే చేశారు. కానీ పాపం ఏం చేద్దాం..విధి ఆడిన వింత నాటకంలో చై బలైయ్యాడు

సీన్ కట్ చేస్తే పిల్లపాపలతో సంతోషంగా గడపాల్సిన ఈ జంట..నీకు నాకు కటీఫ్ అంటూ అధికారికంగా విడాకులు ప్రకటించి అభిమానులను హర్ట్ చేశారు. వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు సంతోషించిన జనం కంటే కూడా వీళ్ళు విడిపోయినప్పుడు బాధపడ్ద జనాభా నే ఎక్కువుగా ఉన్నారు. అంతలా అభిమానులకు నచ్చేసింది ఈ జంట. అబ్బో పెళ్లైన కొత్తల్లో ఈ జంట చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు..వాళ్ళకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి సమంత ప్రత్యేకంగా క్యాప్షెన్లు రాసుకొచ్చేది.

పట్టుమంటే పదేళ్ళు కాపురం చేయకుండానే చైతన్య-సమంత ఇద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక నాగార్జున కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటూ చేతులు దులిపేసుకున్నాడు. విడాకుల తరువాత పరోక్షంగా అక్కినేని అభిమానులను బాధపెడుతున్న సమంత ..రీసెంట్ గా మరో మంట పెట్టింది. ఆ మధ్య చై కు సంబంధించిన గుర్తులను స్వీట్ మెమోరీస్ ఫోటోలను డిలిట్ చేసిన సమంత..ఇప్పుడు ఏకంగా చైతన్య ని ఇన్స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేసింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్‌ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్‌..కేవలం చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Share post:

Popular