గుట్టుచప్పుడుకాకుండా హీరోయిన్ చెల్లెలితో నిశ్చితార్థం చేసుకున్న హీరో .. ఫోటోలు వైరల్‌..!!

ఈ మధ్యకాలంలో సినీ హీరోలంతా పెళ్లి చేసుకుని..ఓ ఇంటి వారు అయిపోతున్నారు. ఇప్పటికే బడా బడా హీరోలు అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను పెళ్లిచేసుకున్నారు. రానా, నితిన్,నిఖిల్ , ఇలా టాప్ హీరోలందరు పెళ్లి చేసుకుని..కుటుంబరావులు అయిపోగా..రీసెంట్ గా ఆ లిస్ట్ లో కి ఎంటర్ అయ్యాడు మరో హీరో కమ్ విలన్. యస్.. ఎవ్వరి తెలియకుండా మీడియా కంట కనపడకుండా..గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ చెల్లెలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది పినిశెట్టి.

యంగ్‌ హీరో ఆది పెనిశెట్టి.. పేరుకు పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎక్స్ ప్రేషన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన హీరోగా విలన్ గా..మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరో గా నటించిన రంగస్దలం సినిమాలో చరణ్ అన్నయ్య క్యారెక్టర్ పోషించిన ఈయన ..సినిమా లో మెయిన్ రోల్ పోషించి..తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. ఆ సినిమా ఆది పర్ ఫామెన్స్ చూసి చరణ్ సైతం మెచ్చుకున్నారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తరువాత ఆయన చాలా సినిమాలో నటించి టాలీవుడ్ కోలీవుడ్ లో తన కంటూ ఓ స్పెషల్ స్దానాని సంపాదించుకున్నారు.

కాగా..గత కొంత కాలంగా హీరోయిన్‌ చెల్లెలు హీరోయి నిక్కీ గల్రానీ తో పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు..డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వినిపిస్తుండగా..ఆ వార్తలనే నిజం చేస్తూ..తాజా గా హీరో ఆది పినిశెట్టి.. తో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన ఈ రిలేషన్ ని..ఇప్పుడు అధికారికంగా ..తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది ఈ జంట. అంతేకాదు తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలియజేస్తూ… ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక్కడ మరో షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది మార్చి 24న..కానీ రెండు రోజుల తర్వాత అంటే శనివారం వాళ్ళ నిశ్చితార్థపు ఫోటోలను రిలీజ్ చేశాతూ .. మేము పెళ్లి చేసుకోబోతున్నం అంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో వాళ్ళ నిశ్చితార్ధపు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Popular